IND VS ENG : ప్రధాన వికెట్లు ఫట్‌.. ఆ ఒక్కడిపైనే భారం.. ఏం జరుగుతుందో ఏమో?

విశాఖ వేదికగా ఇంగ్లండ్‌-భారత్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ప్రధాన బ్యాటర్లు ఔటవ్వగా శుభమన్‌గిల్‌పై భారం పడింది.

New Update
IND VS ENG : ప్రధాన వికెట్లు ఫట్‌.. ఆ ఒక్కడిపైనే భారం.. ఏం జరుగుతుందో ఏమో?

Shubman Gill : హైదరాబాద్‌(Hyderabad) టెస్టులో టీమిండియా(Team India) ఓడిపోతుందని ముందుగా ఎవరూ ఊహించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ డామినుట్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. దీంతో ఓటమి మూటగట్టుకుంది. ఇక విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందానన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే భారత్‌ ఇప్పటికే(లంచ్‌ సమయానికి) నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయింది.

Also Read : Under-19 WC: సచినే హీరో.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా!

అండర్సెన్‌ అదుర్స్:
ఓవర్‌నైట్ స్కోర్‌ 28/0 తో భారత్‌ మూడో రోజు ప్రారంభించింది. స్టార్టింగ్‌లోనే లెజండరీ పేసర్ జేమ్స్‌ అండర్సెన్‌(James Anderson) దెబ్బకు ఓపెనర్లు రోహిత్‌, యశస్వీ జైస్వాల్‌ పెవిలియన్‌ బాట పట్టారు. అండెర్సెన్ వేసిన అద్భుతమైన డెలవరీకి రోహిత్‌ దగ్గర సమాధానం లేకుండా పోయింది. టెస్టుల్లో పేలవ ఫామ్‌ని కొనసాగించిన రోహిత్‌ 13 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో భారత్‌ 29 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఇక ఆ వెంటనే యశస్వీ జైస్వాల్ సైతం ఔట్ అయ్యాడు. అండర్సెస్‌ బౌలింగ్‌లో రూట్‌ చేతికి చిక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ హాండ్రెడ్‌ బాదిన యశస్వీ ఈ ఇన్నింగ్స్‌లో 21 రన్స్ చేశాడు. దీంతో భారత్‌ 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆదుకున్న గిల్-అయ్యర్ జోడి:
వరుస పెట్టి ఫెయిల్ అవుతున్న గిల్, అయ్యర్‌ కాసేపు భారత్‌ బ్యాటింగ్‌(India Bating) ను ముందుకు నడిపించారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలోనే శుభమన్‌ గిల్‌(Shubman Gill) కు అధృష్టం కూడా వరించింది. రెండు లైఫ్‌లు దక్కాయి. ఇలా ఈ జోడి ముందుకు సాగుతున్న సమయంలో టామ్‌ హార్ట్‌లీ అయ్యర్‌ పని పట్టాడు. సుదీర్ఘ ఫార్మెట్‌లో దారుణమైన ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న అయ్యర్ 29 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 111 స్కోర్ వద్ద 3వ వికెట్ కోల్పోయింది భారత్‌. మరో ఎండ్‌లో నిలకడగా బ్యాటింగ్ చేసిన గిల్(Gill) హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సర్ఫరాజ్‌ని కాదని మరీ తుది జట్టులోకి రజత్‌ పఠిదర్‌ని తీసుకొచ్చాడు రోహిత్‌. అయితే రెండు ఇన్నింగ్స్‌లోనూ పఠిదార్‌ నిరశపరిచాడు. కేవలం 9 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో ప్రస్తుతం భారమంతా గిల్‌పైనే ఉంది.

Also Read: ఆమ్రపాలికి మరో కీలక బాధ్యత.. ఉత్తర్వులు జారీ చేసిన దానకిషోర్‌

WATCH:

Advertisment
తాజా కథనాలు