IND vs AUS: మాక్స్ వెల్ ముంచేశాడు.. మూడో టీ20ని చేజార్చుకున్న టీమిండియా

నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ చేతికందిన మ్యాచ్ ను జారవిడుచుకుంది. మాక్స్ వెల్ మాస్టర్ స్ట్రోక్ సెంచరీతో పరుగుల వరద పారించడంతో రుతురాజ్ శతకం మరుగున పడింది. మాక్సీ విధ్వంసంతో మ్యాచ్ లోొ ఆస్ట్రేలియా విజయం సాధించింది.

New Update
IND vs AUS: మాక్స్ వెల్ ముంచేశాడు.. మూడో టీ20ని చేజార్చుకున్న టీమిండియా

IND vs AUS: సంబరాలకు సిద్ధమైన ఫ్యాన్స్ కు చివర్లో ఊహించని షాక్..  తన 100వ అంతర్జాతీయ టీ20లో మాక్స్ వెల్ (Max Well) మాస్టర్ స్ట్రోక్ కు భారత బౌలర్లు విలవిలలాడడంతో గుహవాటిలో జరిగిన మూడో టీ20లో చేతికందిన మ్యాచ్ ను భారత్ వదిలేసుకుంది. చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు చేయాల్సిన స్థితిలో క్రీజులో ఉన్న మాక్స్ వెల్, మాథ్యూ వేడ్ కలిసి భారత బౌలింగ్ ను ఉతికి ఆరేశారు. ఆఖరి ఆరు బంతుల్లో 21 పరుగులు చేయాల్సి ఉండగా ప్రసిధ్ కృష్ణ బౌలింగ్ లో చితగ్గొట్టారు. వరుసగా 4, 1, 6, 4, 4, 4 బాదేయడంతో భారత ఫ్యాన్స్ ఉత్సాహం నీరుగారిపోయింది. ఐదు వికెట్ల తేడాతో కంగారూలను అనూహ్య విజయం వరించింది. ప్రస్తుతం ఈ 5 మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. సిరీస్ లో ఆసిస్ ఆశలను ఈ మ్యాచ్ సజీవంగా నిలిపింది. మొత్తంగా క్రికెట్ ఫ్యాన్స్‎కు మాంచి కిక్కిచ్చే మరో మ్యాచ్ ఇది. తొలి ఇన్నింగ్స్ లో రుతురాజ్ ఉతికేయగా, ఛేదనలో మాక్స్‎వెల్ (104 నాటౌట్; 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సులు) మెరుపులు మెరిపించాడు.

ఇది కూడా చదవండి: టోర్నీ మొత్తంలో ఆ వికెట్టే నాకు సంతృప్తినిచ్చింది.. ప్యాట్‌ కమిన్స్‌

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ కు మొదట్లోనే చుక్కెదురైంది. ఫాంలో ఉన్న యశస్వి జైస్వాల్ తక్కువ స్కోరుకే వెనుదిరగగా, ఇషాన్ పరుగుల ఖాతానే తెరవలేదు. ఆ స్థితిలో బ్యాటింగ్ కు దిగిన సూర్యకుమార్ యాదవ్ రుతురాజ్ తో కలిసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సూర్య నుంచి మంచి సహకారం లభించడంతో రుతురాజ్ (123 నాటౌట్; 57 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్స్‌లు) చితకబాదాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతూ 200కు పైగా స్ట్రైక్ రేటుతో అజేయమైన సెంచరీ నమోదు చేశాడు. భారత్ సాధించిన 222 పరుగుల్లో సగానికి పైగా రుతురాజ్ వే కావడం విశేషం. భారత ఇన్నింగ్స్ లో సూర్య 39, తిలక్ వర్మ 31(నాటౌట్) పరుగులు చేశారు.

ఇది కూడా చదవండి: హార్దిక్ వెనక్కి రావడంపై బుమ్రా అసహనంగా ఉన్నాడా?

ఛేదనలో ఆసిస్ దూకుడు ప్రదర్శించింది. వరల్డ్ కప్ ఫైనల్ హీరో ట్రేవిస్ డేవిడ్ మొదట్లోనే వేగంగా పరుగులు రాబట్టాడు. 18 బంతుల్లో 8 ఫోర్లతో 35 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న డేవిడ్ ను ఆవేశ్ ఖాన్ పెవిలియన్ కు పంపించాడు. అంతకుముందే ఆసిస్ ఆరోన్ హార్డీ వికెట్ కోల్పోయింది. రెండు పరుగుల వ్యవధిలో స్కోరు 68గా ఉండగా జోస్ ఇంగ్లిస్ ను రవి బిష్ణోయ్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చినట్టే అనిపించింది. అయితే, అప్పుడే అసలు ఆట మొదలైంది. గ్లెన్ మాక్స్ వెల్ బంతిని చితగ్గొట్టడంతో ఆస్ట్రేలియన్ స్కోరు బోర్డు బ్రేకుల్లేకుండా దూసుకుపోయింది. స్టాయినిస్, డేవిడ్ ఇలావచ్చి అలా వెళ్లినా, మాథ్యూవేడ్ రాకతో సీన్ మారిపోయింది. వేడ్ క్రమం తప్పకుండా పరుగులు తీస్తూ మాక్సీకి స్ట్రైక్ ఇచ్చాడు. ముఖ్యంగా అక్షర్ పటేల్ వేసిన 19వ ఓవర్ లో మాథ్యూవేడ్ సాధించిన విలువైన పరుగులు ఆసిస్ విజయానికి బాటలు వేశాయి. చివరి ఓవర్ లో ఆఖరి బంతి వరకూ విధ్వంసంతో మాక్స్ వెల్ మ్యాచ్ ను తమవైపు లాగేశాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు