టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) విశ్వరూపం చూపించాడు. తన బ్యాట్‌లో పవర్ తగ్గిందని మాట్లాడిన వారికి అదే బ్యాట్‌తో నోరు మూయించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిలపడి, పోరాడి.. కిందపడ్డా లేచి పరుగెత్తేవాడే నాయకుడు. రోహిత్ శర్మ అలాంటి నాయకుడే.. ఈ విషయం గతంలో అనేకసార్లు ప్రూవ్ అయ్యింది. తాజాగా అఫ్ఘానిస్థాన్‌పై చిన్నస్వామి వేదికగా జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ తన విలువేంటో బీసీసీఐకు కళ్లకు కట్టినట్టు చూపించాడు. సెంచరీతో చెలరేగాడు. రోహిత్ శర్మకు తోడుగా నయా ఫినీషర్ రింకూ సింగ్ రెచ్చిపోవడంతో భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 రన్స్ చేసింది.
ఇద్దరికి ఇద్దరే:
టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే టీమిండియాకు షాక్‌ల మీద షాక్‌లు తగిలాయి. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 6 బంతుల్లో నాలుగే పరుగులు చేశాడు. ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌లో యశస్వీ పెవిలయన్‌కు చేరుకోగానే క్రీజులోకి వచ్చి కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అదే ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌లో ఇబ్రహిం జద్రన్ చేతికి చిక్కాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన గత మ్యాచ్ హీరో శివమ్ దూబే ఆదుకుంటాడనుకుంటే అతను కూడా వెంటనే పెవిలియన్‌కు చేరాడు. 6 బంతులు ఆడి కేవలం ఒక్క పరుగే చేశాడు. ఇక ఆ తర్వాత సంజూశాంసన్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 4.3 ఓవర్లలో 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఇక ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఫినీషర్ రింకూ సింగ్‌తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. ఇద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ స్కోరు బోర్డును కదిలించారు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ తన టాలెంట్ ఏంటో ప్రపంచానికి మరోసారి చూపించాడు. ముందుగా హాఫ్ సెంచరీ.. తర్వాత తనదైన శైలిలో సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా 69 బంతుల్లో 121 రన్స్ చేసిన రోహిత్ శర్మ ఖాతాలో 8 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20 చరిత్రలో 5 సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మనే. అటు రింకూసింగ్ సైతం చివరిలో చెలరేగడంతో భారత్ 200 పరుగులు దాటింది. 39 బంతుల్లోనే 69 పరుగులు చేశాడు రింకూ. చివరి ఓవర్‌లో ఇద్దరు కలిపి 36 పరుగులు పిండుకున్నారు. ఓ నో బాల్ పడింది.
Also Read: ఒక్క మ్యాచ్‌తో అతను ఎలాంటి ప్లేయరో ఎలా డిసైడ్ చేస్తారు? ఇదేం పద్ధతి!
WATCH: