Cylinder Prices Hikes : గ్యాస్ సిలిండర్ ధరలు (Gas Cylinder Prices) మరోసారి పెరిగాయి. చమురు సంస్థలు గ్యాస్ ధరలు పెంచడంతో పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై తీవ్ర ప్రభావం పడింది. 19.5 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 7.50 పెరగనున్నట్లు గ్యాస్ కంపెనీలు ప్రకటించాయి.
పెరిగిన ధరల ప్రభావంతో రాజధాని ఢిల్లీ (Delhi) లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1653.50కి చేరుకుంది. హైదరాబాద్ (Hyderabad) లో రూ.1896కు చేరింది. అయితే, గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఐఓసీఎల్ (IOCL) అధికారిక వెబ్సైట్ ప్రకారం పెరిగిన ధరలు గురువారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర పెంపు.. వ్యాపార వర్గాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అంటే హోటల్స్, టీ షాపులు వంటి చిరు వ్యాపారులపై పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర అదనపు భారం కాబోతుంది.
Also read: ఢిల్లీలో కుండపోత.. ఏడుగురి మృతి!