Flax Seeds: ఇవి తింటే వందేళ్లు వచ్చినా కాల్షియలోపం ఉండదు

అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఇవి తినడం వల్ల బరువు తగ్గొచ్చు, కడుపులో మంట, అజీర్తి, మలబద్ధకం, చెడు కొలెస్ట్రాల్‌, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే అవిసె గింజలను తినాలని నిపుణులు అంటున్నారు.

Flax Seeds: ఇవి తింటే వందేళ్లు వచ్చినా కాల్షియలోపం ఉండదు
New Update

Flax Seeds: అవిసె గింజ‌లను ఆయుర్వేదంలో విరివిగా వాడుతారు. ఈ గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. డాక్టర్లు కూడా అవిసె గింజలు తినాలని సలహా ఇస్తుంటారు. శరీరానికి విటమిన్స్‌, ఫైబర్‌, మినరల్స్‌ బాగా అందుతాయి. ప్రస్తుత కాలంలో చాలా మందికి గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే అవిసె గింజలను తినాలని నిపుణులు అంటున్నారు.

publive-image

ఎందుకంటే వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయని, ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని చెబుతున్నారు. అవిసె గింజల వల్ల ఇతర లాభాలు కూడా ఉంటాయి. ఈ గింజ‌ల‌ను నీళ్లలో నానబెట్టి మొలకెత్తిన తర్వాత తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మొల‌కెత్తిన వాటిని తింటే శరీరానికి పూర్తిస్థాయిలో పోషకాలు అందుతాయని నిపుణులు అంటున్నారు.

publive-image

అవిసె గింజలతో మొల‌కలు చేసుకోలేకపోతే పొడిగా చేసుకోవచ్చు. అవిసె గింజ‌ల‌ను ప్యాన్‌లో వేసి వేయించాలి. ఒక జార్‌లోకి తీసుకుని పొడిగా చేసుకోవాలి. ఈ పౌడర్‌ను గాలి తగలకుండా నిల్వ చేసుకుంటే 10 రోజుల వరకు బాగుంటుంది. దీన్ని ఉదయంపూట పొరగడుపున గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచా కలుపుకుని తాగాలి. పెరుగు లేదా గోధుమ పండిలో వేసుకుని చపాతీలు తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దీనిలోని ఫైబర్‌ పెద్ద పేగును ఆరోగ్యంగా ఉంచుతుంది.

publive-image

ఇవి తినడం వల్ల బరువు తగ్గొచ్చు, కడుపులో మంట, అజీర్తి, మలబద్ధకం ఉండదు. చర్మం కూడా కాంతివంతంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. అవిసె గింజ‌ల‌ను తింటే మెద‌డు ఆరోగ్యం బాగుంటుంది. క్యాన్సర్లు దరిచేరవు. కీళ్ల నొప్పులు, మోకాలి నొప్పులు, ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇది చక్కని ఔషధం, హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్‌తో మహిళల్లో వచ్చే సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే జుట్టు సమస్యలకు కూడా చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు, బాలింతలు తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఎర్రటి ఎండల్లో చల్లటి కబురు..2 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #flax-seeds
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe