Sapota Fruit Benefits: సపోటా పండును డైట్‌లో చేర్చుకోండి.. ఏం జరుగుతుందో తెలుసుకోండి!

పండ్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా సీజనల్‌ ఫ్రూట్స్‌ మన డైట్‌లో కచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. సపోటా పండును మన డైట్‌లో చేర్చుకుంటే స్థూలకాయం, ఊబకాయ, జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు, నిద్రలేమి సమస్యలను దూరం చేస్తుంది.

New Update
Sapota Fruit Benefits: సపోటా పండును డైట్‌లో చేర్చుకోండి.. ఏం జరుగుతుందో తెలుసుకోండి!

Sapota Fruit Benefits: సపోటా తినడానికి రుచికరంగా ఉంటుంది. సపోటాలను తింటే పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సపోటాలో విటమిన్- ఎ కంటికి మేలు చేస్తుంది. సపోటాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, టానిన్లు వాపు, నొప్పిని తగ్గించడంలోఎంతగానో మేలు చేస్తుంది. అయితే.. చలికాలంలో మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక పండ్ల విషయంలో కూడా నిపుణుల సలహా తీసుకొని తినడం ఉత్తమం. సపోటాలో పోటాషియం, కాపర్‌, క్యాల్షియం, ఐరన్‌, జింక్‌, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం వంటి మినరల్స్‌తోపాటు విటమిన ఏ, బి, సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈకాలంలో సపోటాలను తినడం మంచిదేనా? అనే సందేహం కొందరికి ఉంటుంది. పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సపోటా పండ్లు తింటే ఏం అముతుందో.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
సపోటా పండు తింటే కలిగే ప్రయోజనాలు
ఈ చలికాలంలో సపోటాలను తింటే పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సపోటాలో విటమిన్-ఎ కంటికి మేలు చేస్తుంది. సపోటాలో సహజమైన గ్లూకోజ్ అధికంగా ఉంటుంది. ఈ పండు తింటే శరీరానికి శక్తిని ఇస్తుంది. సపోటాలో ఉండే విటమిన్ ఎ, బి, ఇ చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. సపోటాలోని విటమిన్ ఎ ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. ఈ పండ్లలో ఎముకలను బలపరిచే కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి ఎక్కవగా ఉన్నాయి. సపోటాలో డైటరీ ఫైబర్ జీర్ణక్రియను సజావుగా జరిగేలా చేస్తుంది. సపోటతో చేసే మిల్క్‌ షేక్స్‌, ఐస్‌ క్రీమ్స్‌, జ్యూస్‌లు ఎంతో ఇష్టంగా తాగుతారు. సపోటా టేస్టేతోపాటు పోషకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: చలికాలంలో వేయించిన పల్లీలు తింటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి

సపోటాలో కార్బోహైడ్రేట్లు, పోషకాలు అధికంగా ఉంటాయి కాబట్టి మహిళలు గర్భధారణ సమయంలో ఈ పండును తింటే అరోగ్యానికి చాలా మంచిది. సపోటా రక్తస్రావ నివారిణి కనుక పైల్స్ సమస్య ఉంటే ఈ పండ్లు తినటం వలన ఈ సమస్య దూరం అవుతుంది. సపోటాలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం రక్తపోటును తగ్గించేదుకు చాలా ఉపయోగపడుతుంది. షుగర్ పేషంట్స్ అయితే ఈ పండ్లకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. సపోటా ఇంకా ఎన్నో సమస్యల నుంచి బయటపడేలా చేస్తుందని వైద్యులు అంటున్నారు. సపోటా ప్రూట్‌తో స్థూలకాయం, ఊబకాయ, జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు, నిద్రలేమి సమస్యలను సపోటా పండు దూరం చేస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు