Uttar Pradesh: రాజకీయ నేతలపై అనేక అవినీతి(Corruption) ఆరోపణలు వస్తుంటాయి. ఇది కామనే. అయితే, ఈ ఆరోపణలు కొన్ని నిజాలు ఉంటాయి.. కొన్ని అబద్ధాలూ ఉంటాయి. అందరినీ అవినీతిపరులుగా చూడలేము. కానీ, కొందరు ఉంటారు.. ఏ పని చేపట్టినా కమిషన్లు వారికి ముట్టాల్సిందే. తమ నియోజకవర్గంలో పరిధిలో చీమ చిటుక్కుమన్నా తమకు తెలియాల్సిందే. ఏ పని చేపట్టినా.. అందులో కొంత పర్సంటేజ్ వారికి అప్పగించాల్సిందే. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటనే వెలుగు చూసింది. తనకు కమిషన్ చెల్లించలేదనే కారణంతో ఓ ఎమ్మెల్యే వేసిన రోడ్డును తవ్వించేశారట. ఈ ఘటన యూపీలోని షాజహాన్పూర్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..BJP MLA: మీ కక్కుర్తి తగలెయ్య.. కమిషన్ ఇవ్వలేదని వేసిన రోడ్డును తవ్వించిన ఎమ్మెల్యే..
తనకు కమిషన్ చెల్లించలేదనే కారణంతో ఓ ఎమ్మెల్యే వేసిన రోడ్డును తవ్వించేశారట. ఈ ఘటన యూపీలోని షాజహాన్పూర్ పరిధిలో చోటు చేసుకుంది. షాజహాన్పూర్ నుండి బుదౌన్ను కలుపుతూ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పిడబ్ల్యుడి) వేసిన అర కిలోమీటరు రోడ్డును 'కమీషన్' చెల్లించని కారణంగా బిజెపికి చెందిన ఎమ్మెల్యే అనుచరులు తవ్వించేశారు. బుల్డోజర్లతో రోడ్డునంతా తవ్వేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Translate this News: