BJP MLA: మీ కక్కుర్తి తగలెయ్య.. కమిషన్ ఇవ్వలేదని వేసిన రోడ్డును తవ్వించిన ఎమ్మెల్యే..

తనకు కమిషన్ చెల్లించలేదనే కారణంతో ఓ ఎమ్మెల్యే వేసిన రోడ్డును తవ్వించేశారట. ఈ ఘటన యూపీలోని షాజహాన్‌పూర్ పరిధిలో చోటు చేసుకుంది. షాజహాన్‌పూర్ నుండి బుదౌన్‌ను కలుపుతూ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) వేసిన అర కిలోమీటరు రోడ్డును 'కమీషన్' చెల్లించని కారణంగా బిజెపికి చెందిన ఎమ్మెల్యే అనుచరులు తవ్వించేశారు. బుల్డోజర్లతో రోడ్డునంతా తవ్వేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

New Update
BJP MLA: మీ కక్కుర్తి తగలెయ్య.. కమిషన్ ఇవ్వలేదని వేసిన రోడ్డును తవ్వించిన ఎమ్మెల్యే..

Uttar Pradesh: రాజకీయ నేతలపై అనేక అవినీతి(Corruption) ఆరోపణలు వస్తుంటాయి. ఇది కామనే. అయితే, ఈ ఆరోపణలు కొన్ని నిజాలు ఉంటాయి.. కొన్ని అబద్ధాలూ ఉంటాయి. అందరినీ అవినీతిపరులుగా చూడలేము. కానీ, కొందరు ఉంటారు.. ఏ పని చేపట్టినా కమిషన్లు వారికి ముట్టాల్సిందే. తమ నియోజకవర్గంలో పరిధిలో చీమ చిటుక్కుమన్నా తమకు తెలియాల్సిందే. ఏ పని చేపట్టినా.. అందులో కొంత పర్సంటేజ్ వారికి అప్పగించాల్సిందే. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటనే వెలుగు చూసింది. తనకు కమిషన్ చెల్లించలేదనే కారణంతో ఓ ఎమ్మెల్యే వేసిన రోడ్డును తవ్వించేశారట. ఈ ఘటన యూపీలోని షాజహాన్‌పూర్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

షాజహాన్‌పూర్ నుండి బుదౌన్‌ను కలుపుతూ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) వేసిన అర కిలోమీటరు రోడ్డును 'కమీషన్' చెల్లించని కారణంగా బిజెపికి చెందిన ఎమ్మెల్యే అనుచరులు తవ్వించేశారు. బుల్డోజర్లతో రోడ్డునంతా తవ్వేశారు. ఈ వ్యవహారంపై రోడ్డు వేసిన కాంట్రాక్టర్, నిర్మాణ సంస్థ మేనేజర్ రమేష్ సింగ్ ఫిర్యాదు చేయడంలో విషయం వెలుగు చూసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో బీజేపీ ఎమ్మెల్యే వీర్ విక్రమ్ సింగ్ ప్రతినిథి/అనుచరుడి పేరు కూడా ఉంది. వీరిపై పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ నిరోధక చట్టంఓని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఎమ్మెల్యే ప్రతినిధిగా పరిచయం చేసుకున్న జగ్వీర్ సింగ్ నిర్మాణ సంస్థ ఉద్యోగులను పలు సందర్భాల్లో బెదిరించి, సంస్థ నుంచి 5 శాతం కమీషన్ (నిర్మాణ పనులు చేసేందుకు డబ్బులు) డిమాండ్ చేశాడని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. 'ఈ కమీషన్ ఇవ్వకపోవడంతో అక్టోబర్ 2న తాము నిర్మించిన రోడ్డులో అర కిలోమీటరు మేర బుల్ డోజర్లతో తవ్వారు' అని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు రమేష్ సింగ్. జైతీపూర్ నుండి నవాడా మీదుగా బుదౌన్ జిల్లా వరకు రహదారిని నిర్మిస్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అశోక్ కుమార్ మీనా తెలిపారు.

అయితే, జగ్వీర్ సింగ్ తన వెంట 20 మందిని తీసుకుని రోడ్డు నిర్మాణ స్థలానికి చేరుకున్నాడు. రోడ్డు నిర్మాణం చేస్తున్న కార్మికులను కర్రలతో కొట్టారు. బుల్డోజర్లతో రోడ్డును అర కిలోమీటరు మేర తవ్వించారని ఎస్పీ వెల్లడించారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారందరినీ త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై అడిషనల్ డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ పాండే మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణకు పిడబ్ల్యూడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, తిల్హార్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఘటనపై విచారణ చేపట్టనుంది. కమిటీ నివేదిక వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటామని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులను మళ్లీ ప్రారంభించాలని, కార్మికులకు పోలీసు భద్రత కల్పించాలని ఆదేశించారు.

కాగా, ఈ అంశంపై ఎమ్మెల్యే వీర్ విక్రమ్ సింగ్‌ను ప్రశ్నించగా.. ఆ ఘటనకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. తనపై కావాలనే బురద జల్లుతున్నారని అన్నారు. జగ్వీర్ సింగ్ బీజేపీ కార్యకర్తనే అని, అయితే, తనకు అతనికి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు.

Also Read:

CM’s Breakfast Scheme: ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్.. శుక్రవారం నుంచే ప్రారంభం..

Harish rao: 23 కోట్లతో 50 పడకల సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాక్‌.. మంత్రి హరీశ్‌రావు వరాల జల్లు!

Advertisment
Advertisment
తాజా కథనాలు