Etela: రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలు... చూసేది బీఆర్ఎస్ పార్టీ నేతలు: ఈటల

బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తనదైన స్ట్లైల్ లో బీఆర్ఎస్ పై సెటైర్లు వేశారు. రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలైతే.. చూసేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలన్నారు. అందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉండాలని ఆయన ఎద్దేవా చేశారు.

New Update
కాంగ్రెస్‌ను గెలిపించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు.. ఈటల సంచలన వ్యాఖ్యలు..

Etela: బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) మరోసారి తనదైన స్ట్లైల్ లో బీఆర్ఎస్ (BRS) పై సెటైర్లు వేశారు. రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలైతే.. చూసేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలన్నారు. అందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉండాలని ఆయన ఎద్దేవా చేశారు. ఇక ఓ గిరిజన మహిళ పై దాడి చేస్తే సీఎం కేసీఆర్ (CM KCR) ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి సర్కార్ చేతులు దులుపుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు.

కాగా, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఈటల డిమాండ్ చేశారు. అదే విధంగా పోలీసులు బాధితులకు క్షమాపణ చెప్పాలన్నారు. అదే విధంగా గిరిజన మహిళ పై దాడి విషయంపై దర్యాప్తు చేయాలని ఈటల డిమాండ్ చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో దళిత బస్తీలో జనాలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

అయితే  ఈరోజు ఉదయం ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ (Minister KTR) మాట్లాడుతూ..ప్రతిపక్షాలకు 2023 చివరలో మళ్లీ సినిమా చూపిస్తామన్నారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని ఇంకా మొత్తం సినిమా బాకీ ఉందన్నారు. పంచ్ డైలాగ్స్ తో ప్రతిపక్షాలను హెచ్చరించిన ఆయన సినిమా అంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్డులో చూసేది కాదు.. ప్రతిపక్షాలకు చూపించే సినిమా 2023 లోనే ఉందన్నారు. గత తొమ్మిదేళ్లలో చూపించింది ట్రైలర్ మాత్రమేనని పేర్కొన్నారు. ఇక దీనికి కౌంటర్ గా ఈటల అలా రియాక్ట్ అయ్యారు.

Also Read: ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తాం.. కేటీఆర్ సవాల్

Advertisment
తాజా కథనాలు