2023లో ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తామని మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ఇటీవల నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్‌ను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 450 కోట్ల వ్యయంతో 2.65 కిలోమీటర్ల పొడవైన స్టీల్ బ్రిడ్జిని నిర్మించామన్నారు. ఈ ఉక్కు వంతెనకు మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పేరు పెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం నగరంలో సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా చేపట్టిన 45 ప్రాజెక్టుల్లో ఇది ఒకటన్నారు. హైదరాబాద్‌లో తొలిసారి భూసేకరణ చేపట్టకుండా నిర్మించిన బ్రిడ్జి ఇదే కావడం గమనార్హం. ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో రూ.5112.36 కోట్ల అంచనా వ్యయంతో 48 ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో ఇప్పటి వరకు 35 ప్రాజెక్టులను పూర్తిచేసి నగరవాసులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. వీటిలో 19 ఫ్లై ఓవర్లు, 5 అండర్ పాస్‌లు, 7 ఆర్వోబీ/ఆర్‌యూబీలు, కేబుల్ బ్రిడ్జి, మరో 3 ఇతర పనులను ప్రభుత్వం పూర్తిచేసింది.
పూర్తిగా చదవండి..KTR: ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తాం.. కేటీఆర్ సవాల్
హైదరాబాద్‌లొ మరో మణిహారం చేరింది. సౌత్ ఇండియాలోనే అతిపొడవైన స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ద్వారా నగరంలో ట్రాఫిక్ సమస్య మరింత సులుకానుంది.
Translate this News: