Telangana : తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు:విద్యాశాఖ

ఎండలు తీవ్రమవుతున్ననేపథ్యంలో రాష్ట్రంలో ఒంటిపూట బడులు నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈనెల 15 నుంచి బడులను ఒంటిపూట నిర్వహిస్తారని తెలిపింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులను నిర్వహిస్తారని విద్యాశాఖ స్పష్టం చేసింది.

New Update
Telangana: రేపటి నుంచే తెలంగాణలో బడులు ప్రారంభం

Telangana :  రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పాఠశాలలను ఒంటిపూట నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈనెల 15 నుంచి రాష్ట్రంలోని పాఠశాలలను ఒంటి పూట మాత్రమే నిర్వహిస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ బడుల్లో ఏప్రిల్ 23 వరకు సగంపూట బడులను నిర్వహిస్తారు.

ఈనేపథ్యంలో రాష్ట్రంలోని బడులు ఉదయం 8గంటలకు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయని విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనాన్ని మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అందజేయనున్నట్లు తెలిపింది. 10వ తరగతి పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం పూట బడులను నిర్వహిస్తారని తెలిపింది. వీరికి మొదట మధ్యాహ్నం భోజనం అందజేసిన తర్వాత తరగతులు కొనసాగించనున్నారు. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే తరగతులు నిర్వహిస్తారని విద్యాశాఖ పేర్కొంది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో స్పెషల్ డీఎస్సీకి కసరత్తు.. సీతక్కతో మంతనాలు!

Advertisment
తాజా కథనాలు