Viral: స్కూటీ హెడ్ లైట్ నుంచి వింత శబ్ధాలు.. ఏంటా ఓపెన్ చేయగ గుండె గుభేల్..

పాములు, ఎలుకలు, చిన్న చిన్న పరుగులకు ఏ కొంచెం సందు దొరికినా, ఆ ప్లేస్ వాటికి సురక్షితం అనిపించినా.. అక్కడే తమ బస ఏర్పాటు చేసుకుంటాయి. అది నిర్మానుష్య ప్రాంతమైనా.. ఇళ్లైనా.. ఇంట్లోని వస్తువులైనా.. వెంటనే దూరిపోతాయి. ఇక పాముల విషయానికి వస్తే.. అవి చిన్న రంద్రం కనిపిస్తే చాలు వెంటనే అందులోకి వెళ్లి దాక్కుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.

Viral: స్కూటీ హెడ్ లైట్ నుంచి వింత శబ్ధాలు.. ఏంటా ఓపెన్ చేయగ గుండె గుభేల్..
New Update

Snake Stuck incide Scooty Engine: పాములు, ఎలుకలు, చిన్న చిన్న పరుగులకు ఏ కొంచెం సందు దొరికినా, ఆ ప్లేస్ వాటికి సురక్షితం అనిపించినా.. అక్కడే తమ బస ఏర్పాటు చేసుకుంటాయి. అది నిర్మానుష్య ప్రాంతమైనా.. ఇళ్లైనా.. ఇంట్లోని వస్తువులైనా.. వెంటనే దూరిపోతాయి. ఇక పాముల విషయానికి వస్తే.. అవి చిన్న రంద్రం కనిపిస్తే చాలు వెంటనే అందులోకి వెళ్లి దాక్కుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఎక్కడా చోటు లేనట్లు ఓ పాము.. స్కూటీ హెడ్ లైట్‌ ల్యాంప్‌లోకి చొరబడింది. అయితే, స్కూటీ యజమాని.. తన స్కూటీని స్టార్ చేయగా.. హెడ్ లైట్ నుంచి చిత్ర విచిత్రమైన శబ్ధాలు వినిపించాయి.

దాంతో హడలిపోయిన బైక్ ఓనర్. అందులో ఏముందా? అని కంగారు పడి చూశాడు. ఇంకేముంది.. అందులో పాము కనిపించే సరికి గుండె ఝల్లుమంది. భయంతో రెండగుడులు వెనక్కి వేశాడు. కాసేపటికి కాస్త ధైర్యం చేసి.. ఆ పామును బయటకు వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, అది బయటకు రాకుండా.. అందులోనే నక్కింది. దాదాపు రెండు గంటల పాటు.. స్కూటీలోంచి బయటకు రాలేదు. పామును తీయడానికి ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. ఇక లాభం లేదనుకున్న స్కూటీ ఓనర్.. మెకానిక్‌ను పిలిపించాడు. దాని ముందరి భాగాలను విడదీయగా.. ఆ పాము బయటకు వచ్చింది. ఈ ఘటన తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సిరిసిల్లా పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద షబ్బీర్ అనే వ్యక్తి తన స్కూటీని పార్క్ చేశాడు. ఇంతలో అటుగా వచ్చిన పాము.. స్కూటీపైకి ఎక్కింది. ఆ తరువాత మెల్లగా లోపలి భాగాల్లోకి దూరింది. అది గమనించిన స్కూటీ యజమానిని దానిని వెళ్లగొట్టేందుకు గట్టి ప్రయత్నమే చేశాడు. కానీ, హెడ్ లైట్ లోపలి భాగంలోకి దూరిన పాము.. అక్కడ చిక్కుకుపోయింది. దాంతో ఆ పక్కనే ఉన్న మెకానిక్ సాయంతో స్కూటీ ఫ్రంట్ పార్ట్‌లను విప్పేశారు. అప్పటికే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. అతను వచ్చాక.. మెకానిక్ స్కూటర్ ముందరి భాగాలను విప్పగా.. స్నేక్ క్యాచర్ ఆ పామను చాకచక్యంగా పట్టుకుని ఓ డబ్బాలో బందించాడు. అనంతరం దానిని ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేశాడు. కాగా, ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో జనాలు కాస్త హడలిపోయినా.. ఆసక్తిగా చూశారు. మొత్తానికి స్కూటీ నుంచి పాము బయటకు రావడంతో ఆ స్కూటీ యజమాని హమ్మయ్య అనుకున్నాడు.

Also Read:

Andhra Pradesh: నేడు తిరుమలకు సీఎం జగన్.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ..

మొదటి పూజకు సిద్ధమయిన ఖైరతాబాద్ వినాయకుడు

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe