/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/MODI-3-jpg.webp)
Kali Devi : ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) కి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. బీజేపీ(BJP) కార్యకర్తల్లోనూ మోదీ అభిమానులే ఎక్కువగా ఉంటారు. అలాంటి అభిమానులు చేసే కొన్ని పనులు...అది అభిమానం కాదు పిచ్చి అని ఇట్టే అర్థం అవుతుంది. ప్రధాని మోదీ అంటే పిచ్చితో ఓ అభిమానిని వికలాంగుడిని చేసింది. ప్రధానిగా నరేంద్రమోదీ మూడో సారి హ్యాట్రిక్ కొట్టాలంటూ ఓ వ్యక్తి కాళీదేవికి రక్తతర్పనం చేశాడు. ఈ క్రమంలో అతని వేలు తెగిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే తాము కూడా ఏం చేయలేమని వైద్యులు చెత్తులెత్తయడంతో అతనికి వేలు లేకుండా పోయింది. ఈ ఘటన కర్నాటక(Karnataka) లో చోటుచేసుకుంది.
కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ ఘటన జరిగింది కర్వార్ లోని సోనార్వాడలో నివాసం ఉంటున్న అరుణ్ వెర్నేకర్ ప్రధాని మోదీకి వీరాభిమాని. ఆభరణాల వ్యాపారి అయిన అరుణ్ వెర్నేకర్ బీజేపీ మద్దతుదారుడు. అంతేకాదు మోదీపై ఉన్న అభిమానంతో ఏకంగా తన ఇంట్లోనే మోదీ కోసం ఒక చిన్న గుడిని సైతం కట్టించాడు. నిత్యం మోదీ విగ్రహానికి పూజలు చేస్తుంటాడు. ఈక్రమంలోనే ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు(General Elections) జరుగుతుండటంతో ప్రధాని మోదీ మళ్లీ గెలవాలని ఆకాంక్షించాడు. ఇందుకోసం తన ఇంట్లో మోదీ గుడి పక్కన ఉన్న కాళీ మాత ఫోటో దగ్గర రక్త తర్ఫనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే కత్తిని తీసుకువచ్చి తన వేలును కట్ చేసుకున్నాడు.
#Karnataka man accidentally chops off finger praying for PM #NarendraModi's third termhttps://t.co/YVboyTreLJ pic.twitter.com/DAsJtHpOuC
— Hindustan Times (@htTweets) April 10, 2024
ఈ ఘటనతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. వేలు నరుక్కోవడంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తరుణ్ ను పరిశీలించిన వైద్యులు.. అతని వేలు సగానికిపైగా తెగిందని తెలిపారు. అయితే వేలిని సర్జరీ చేసి అతికించడం కష్టమని చెప్పారు. ఎడమ చేతి చూపుడు వేలును కత్తితో కోసుకునేందుకు ప్రయత్నించిన వెర్నేకర్ గట్టిగా కోసుకోవడంతో ఆ వేలు సగానికి తెగింది. అందులో నుంచి వచ్చిన రక్తంతో కాళీమాతా మా మోదీని రక్షించు అని రాసాడు. ఇలా రక్తాభిషేకం చయడం కోసం వేలును కట్ చేసుకోవడంపై నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ఇది కూడా చదవండి: సివిల్స్ నోటిఫికేషన్ వచ్చేసిందోచ్..వివిధ విభాగాల్లో 827 పోస్టుల భర్తీ.!