INDIA Corona Cases : దేశంలో కరోనా జేఎన్.1(Corona JN 1) వైరస్ వ్యాప్తి వేగంగా చెందుతుంది. ఈ వైరస్ భారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతూ వస్తుంది. రోజువారీ కరోనా(Covid-19) కేసులో నమోదు సంఖ్య 500 లకు తగ్గడం లేదు. తాజాగా కేంద్ర వైద్యారోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 692 మందికి కరొనట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 4,097 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కరోనా దాటికి నిన్న ఒకే రోజు ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. గత 24 గంటల్లో దేశంలో ఆరు మరణాలు నమోదయ్యాయని.. మహారాష్ట్రలో రెండు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కటి నమోదు అయినట్లు తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నట్లు తెలిపింది. కరోనా కేసులో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ సూచించింది.
ALSO READ:
-
కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. ఆరు గ్యారెంటీల దరఖాస్తు ప్రక్రియ అందుకేనా
- రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు షురూ!