ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఓడిపోయి.. బీజేపీ విజయభేరీ మోగించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ జరిగిన ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు బయటపడ్డాయి. ఓ అభ్యర్థి కేవలం 16 ఓట్ల తేడాతోనే గెలవడం చర్చనీయాంశమైంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కంకేర్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఆశారాం.. కాంగ్రెస్ అభ్యర్థి శంకర్‌ధృవాపై 16 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆశారాంకు 67,980 ఓట్లు రాగా.. శంకర్‌కు 67,964 ఓట్లు వచ్చాయి. అంతేకాదు అంబికాపూర్ నుంచి పోటీ చేసిన డిప్యూటీ సీఎం సింగ్ దేవ్ కూడా బీజేపీ నేత రాజేష్ అగర్వాల్ చేతిలో కేవలం 94 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. సింద్ దేవ్‌కు 90,686 ఓట్లు రాగా.. రాజేష్ అగర్వాల్‌కు 90,780 ఓట్లు వచ్చాయి.
Also read: కాంగ్రెస్ గెలుపు వెనుక సునీల్ కనుగోలు.. ఆయన దిమ్మదిరిగే వ్యూహాలు ఇవే!
ఇదిలా ఉండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 54 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 35 సీట్లకే పరిమితమైపోయింది. మరి ఇంత తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోవడంపై అక్కడి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఒక్క ఓటు కూడా చాలా ముఖ్యమని అంటుంటారు.