Rahul Gandhi: మోదీ.. మోదీ అంటున్న బీజేపీ కార్యకర్తలకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తోన్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం అస్సాంలో కొనసాగుతోంది. అయితే ..ఈ యాత్ర జరుగుతున్న మార్గంలోకి కొందరు భాజపా కార్యకర్తలు.. జై శ్రీరామ్, మోదీ-మోదీ నినాదాలు చేస్తూ దూసుకురాగా వారికి గాల్లో ముద్దులు పెడుతూ రాహుల్ అభివాదం చేశారు. By Nedunuri Srinivas 22 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Rahul Gandhi Flying Kisses: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తోన్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రస్తుతం అస్సాంలో (Assam) కొనసాగుతోంది. అయితే .. ఈ యాత్ర జరుగుతున్న మార్గంలోకి కొందరు భాజపా కార్యకర్తలు.. జై శ్రీరామ్, మోదీ-మోదీ నినాదాలు చేస్తూ దూసుకు రాగా వారిని పోలీసులు చెదరగొట్టారు. రాహుల్ వాహనాన్ని బిజెపి కార్యకర్తలు ముట్టడి రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈశాన్య రాష్ట్రంలోని 17 జిల్లాలను కవర్ చేస్తూ మొత్తం 833 కి.మీ.మేర నిర్వహిస్తోన్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈ నెల 18 నుంచి జనవరి 25 వరకు కొనసాగుతుంది.అయితే ఈ యాత్రకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రస్తుతం అస్సాంలో కొనసాగుతోంది. యాత్ర జరుగుతుండగా (Bharat Jodo Nyay Yatra) రాహుల్ వెళ్తున్న వాహనాన్ని కొందరు బిజెపి కార్యకర్తలు చుట్టుముట్టారు . జై శ్రీరామ్, మోదీ-మోదీ అంటూ నినాదాలు చేశారు. అయితే రాహుల్ ఏమాత్రం ఆ సమూహానికి భయపడకుండా నినాదాలు చేస్తున్న బిజెపి (BJP) కార్యకర్తలకు ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ వారికి అభివాదం చేయడమే కాకుండా .. బస్సులో ఉన్న భద్రతా సిబ్బందితో ఇక్కడ ఎందుకు ఆపకూడదు అంటూ బస్సు ఆపించి దిగి నినాదాలు చేస్తున్న వారితో చేతులు కలిపేందుకు ప్రయత్నించడం గమనార్హం. सबके लिए खुली है मोहब्बत की दुकान, जुड़ेगा भारत, जीतेगा हिंदुस्तान।🇮🇳 pic.twitter.com/Bqae0HCB8f — Rahul Gandhi (@RahulGandhi) January 21, 2024 భారత్ ఏకమవుతుంది, దేశం గెలుస్తుంది భాజపా కార్యకర్తలు చేసిన ఈ ముట్టడికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేశారు.‘మా ప్రేమ దుకాణం ప్రతిఒక్కరికీ తెరచే ఉంటుంది. భారత్ ఏకమవుతుంది, దేశం గెలుస్తుంది’ అంటూ వీడియో పోస్ట్ చేశారు. ఆ తరువాత జరిగిన బహిరంగసభలో రాహుల్ మాట్లాడుతూ .. కొందరు భాజపా కార్యకర్తలు తమ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారని అయినప్పటికీ ప్రధాని మోదీకి (PM Modi), అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మకు కాంగ్రెస్ భయపడదని అన్నారు. రాహుల్ భయపడ్డారు ఈ ఘటనపై భాజపా స్పందిస్తూ . జైశ్రీరామ్, మోదీ నినాదాలతో కాంగ్రెస్ నేత రాహుల్ భయపడ్డారని పేర్కొంటూ .. మా నినాదాలు చేసిన బాజాపా కార్యకర్తలపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేయగా , సెక్యూరిటీ సిబ్బంది రాహుల్ గాంధీని అడ్డుకున్నారని విమర్శలు గుప్పించింది. ఆది నుంచి అడ్డంకులే బహిరంగ ప్రదేశాల్లో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్రకు మణిపుర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో యాత్ర రూట్‌మ్యాప్‌ను మార్చిన విషయం తెలిసిందే. ఇన్ని విమర్శల మధ్య రాబోయే ఎన్నికలే టార్గెట్ గా చేస్తోన్న ఈ యాత్ర ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి. ALSO READ:నేరవేరిన ఏళ్ళ కల.. అయోధ్యలో కొలువైన బాలరాముడు #rahul-gandhi #bjp #bharat-jodo-nyay-yatra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి