Adilabad: రహదారులు కావు.. మృత్యుదారులు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రహదారులు దారుణంగా మారాయి. మూల మలుపులుగా ఉండే ఈ రహదారుల వల్ల అనేక మంది మృతి చెందారు. అంతే కాకుండా వాహనాలు అదుపు తప్పి పక్కనే ఉండే ఇళ్లలోకి దూసుకెళ్తున్నాయి.

Adilabad: రహదారులు కావు.. మృత్యుదారులు
New Update

Adilabad Roads: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని రహదారులు మృత్యు దారులుగా మారాయి. ఉమ్మడి జిల్లాలోని బోథ్‌, ఊట్నూరుకు వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారింది. దీంతో ఆ రోడ్డుపై వెళ్లాలంటేనే ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు ఘన్‌పూర్‌, బోథ్‌ మధ్య ఉన్న రహాదారిలో అనేక మలుపులు ఉన్నాయి. దీంతో ఎటువైపు నుంచి ఏ వాహనం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అంతే కాదు వేగంగా వచ్చిన వాహన దారులు మూల మలుపుల వద్ద రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడుతున్నారు.

ఇలా గుంతలో పడి ఇప్పటి వరకు అనేక మంది మరణించారు. దీంతో ఈ రహదారి గుండా వేళ్లాలంటేనే వాహనాదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్కడి రహదారులు ఇరుగ్గా ఉండటం వల్ల ఓ బస్సుకు కార్‌ ఎదురుగా వస్తే అందులో ఏదో ఒక వాహనం వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ప్రమాద హెచ్చరికలు కూడా లేకపోవడం ప్రమాదాలకు మరో కారణంగా మారింది. రాత్రి సమయంలో గత రెండు రోజుల క్రితం బైక్‌పై వెళ్తున్న యువకుడు మూల మలుపు గమనించకపోవడంతో గుంతలో పడి మృతిచెందాడు. అంతేకాదు స్థానికులు ఉదయం 10 గంటల వరకు అక్కడ మృతదేహం ఉందనే విషయాన్ని గమనించలేక పోయారు.

మరోవైపు హస్నాపూర్‌ వద్ద ఉన్న మరో మూలమలుపు ప్రమాదకరంగా మారింది. గ్రామం మధ్య గుండా వాగు వెళ్లిందని గ్రామస్తులు తెలిపారు. దీంతో రహదారి విస్తీర్ణం చిన్నగా ఉండటంతో వాహనాలు అదుపుతప్పి ఇళ్లలోకి దూసుకొస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇక్కడ ప్రమాదకరంగా మూల మలుపు ఉందని తెలిసిన వాహనదారులు వారు నెమ్మదిగా వస్తుండగా.. తెలియని వారు వేగంగా వస్తూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నట్లు తెలిపారు. తమ గ్రామంలో రోడ్డు విస్తీర్ణం పెంచాలని వారు కోరుతున్నారు.

Also Read: కాంగ్రెస్ దళితులను మోసం చేసే ప్రయత్నం చేస్తోంది: ఎమ్మెల్సీ కవిత

#adilabad #roads #travel #difficulties #both #ghanpur #adilabad-roads #adilabad-road-accidents
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe