Viral News: కడుపులా? కాగులా? 9 నెలల్లో రూ. 1308 కోట్ల మద్యం తాగారట..ఎక్కడో తెలుసా?

యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ లోని మందుబాబులు 9 నెలల్లోనే 13 వందల కోట్ల మద్యం తాగి రికార్డు సృష్టించారు. ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 29 వరకు 9 నెలల్లో ఈ తెగ తాగుడు జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఇప్పుడు వీరి మద్యం ఖర్చు 16% పెరిగింది.

New Update
Viral News: కడుపులా? కాగులా? 9 నెలల్లో రూ. 1308 కోట్ల మద్యం తాగారట..ఎక్కడో తెలుసా?

కొందరు పండగలకు మద్యం (alcohol) తాగుతే..మరికొందరు మందు కోసం స్పెషల్ గా విందులను ఏర్పాటు చేసుకుంటారు. పీకలదాక తాగి..ఆ కిక్కులో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కానీ ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని పారిశ్రామిక నగరమైన గౌతమ్ బుద్ధ నగర్ (Gautam Buddha Nagar) మందుబాబులు   9 నెలల్లో భారీగా మద్యం తాగి రికార్డ్ క్రియేట్ చేశారు. ఎక్సైజ్ శాఖ (Excise Department)అధికారుల ప్రకారం, ఏప్రిల్ 1 నుండి డిసెంబర్ 29 వరకు, ఇక్కడ ప్రజలు రూ. 1,308.59 కోట్ల మద్యం సేవించగా, గతేడాది ఇదే కాలంలో ఈ సంఖ్య రూ. 1,125.12 కోట్లు వరకు ఉందట. ఈ ఏడాది మద్యం విక్రయాలు 16.30 శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు.

కొత్త సంవత్సరం సందర్భంగా కూడా ఇక్కడ మద్యం విక్రయాలు విపరీతంగా ఉంటాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. న్యూఇయర్ వేడుకల్లో (New Year celebrations) దాదాపు రూ.12 కోట్ల మద్యం విక్రయాలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని పోయినసారి ఇక్కడి మద్యంప్రియులు రూ.9 కోట్లకు పైగా మద్యం తాగారు. జిల్లా ఎక్సైజ్ అధికారి సుబోధ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ జిల్లాలో 439 మద్యం దుకాణాలు ఉన్నాయని, ఇందులో పల్లె మద్యం, ఇంగ్లీషు మద్యం, బీరు దుకాణాలు ఉన్నాయని తెలిపారు.

మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ (New Year celebrations) నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ ఏడాది వందల సంఖ్యలో మద్యం స్మగ్లర్లను అరెస్టు చేయడంతోపాటు కోట్లాది రూపాయల విలువైన వేల లీటర్ల స్మగ్లింగ్ మద్యం రికవరీ అయిందని తెలిపారు. ఈ ఏడాది వివిధ పోలీస్ స్టేషన్లలో 33 మందికి పైగా కేసులు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.

ఇది కూడా చదవండి: ఈ ఆహారపు అలవాట్లతో మలబద్ధకం సమస్యకు పరిష్కారం.. అవేంటో చూడండి..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు