Ration Card E-KYC: రేషన్‌ కార్డు దారులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ-కేవైసీ లేకుంటే పథకాలు కట్‌!

రేషన్‌ కార్డుల ఈ-కేవైసీ గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుండగా అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈకేవైసీ పూర్తి చేసిన కుటుంబ సభ్యుల వివరాలే రేషన్ కార్డులో ఉంటాయని, వారికి మాత్రమే రేషన్ సరుకులు వస్తాయని తెలిపారు. ఫిబ్రవరి 29 చివరి తేదీ.

New Update
Ration Card E-KYC: రేషన్‌ కార్డు దారులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ-కేవైసీ లేకుంటే పథకాలు కట్‌!

Ration Card E-KYC: తెలంగాణలో దాదాపు 90 లక్షల రేషన్‌ కార్డులున్నాయి. అయితే వీరిలో చాలా మంది ఇప్పటికీ ఈ-కేవైసీ చేయించుకోలేదు. రేషన్‌ కార్డుల ఈ-కేవైసీ గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఆ లోపు ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి. లేదంటే రేషన బియ్యం, ఇతర పథకాలు ఆగిపోనున్నాయి. రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియ చాలా కాలంగా కొనసాగుతోంది. రేషన్‌కార్డులో ఉన్న సభ్యులు తమ వివరాలను రేషన్ డీలర్లను వద్ద నమోదు చేసి.. ధృవీకరించాలి. కానీ ఇప్పటికీ చాలా మంది ఇంకా చేయలేదు. ఫిబ్రవరి 29తో గడువు ముగుస్తుంది. ఇంకా వారం రోజులే సమయం ఉండడంతో.. ఇప్పటికీ రేషన్ కార్డుల ఈ కేవైసీ పూర్తి చేయవని వారు.. వెంటనే చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

పొడిగించే అవకాశం లేదు..
మరోసారి గడువును పొడిగించే అవకాశం లేదని చెబుతున్నారు. ఫిబ్రవరి 29లోగా చేసుకోవాలని సూచిస్తున్నారు. రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియ జనవరి 31తో ముగియాల్సి ఉంది. కానీ తెలంగాణ, ఏపీ సహా అనేక రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ మొత్తం ఇంకా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో రేషన్‌ కార్డులను ఆధార్‌ సంఖ్యతో అనుసంధానించే గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పెంచింది కేంద్రం. తెలంగాణలో ఇప్పటి వరకు రేషన్‌ కార్డుల ఈ-కేవైసీ 85 శాతం మేర పూర్తయినట్లు తెలుస్తోంది . ఫిబ్రవరి నెలాఖరుకల్లా 100 శాతం పూర్తి చేయాలని పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌.. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, హైదరాబాద్‌ చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌కు ఆదేశాలు జారీచేశారు. రేషన్‌కార్డులకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన కేంద్రం ప్రభుత్వం.. వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఈకేవైసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. లబ్ధిదారులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసలు వెళ్లటం, మరణించిన కుటుంబ సభ్యుల పేర్లు ఇంకా కార్డుల్లో ఉండటంతో.. వాటిని ప్రక్షాళన చేస్తోంది. రేషన్ కార్డులో పేర్లున్న వారంతా.. తమ ఆధార్ కార్డుతో బయోమెట్రిక్ వివరాలు ఇవ్వాలి. అప్పుడు మాత్రమే వారి పేర్లను రేషన్ కార్డుల్లో కొనసాగిస్తారు. లేదంటే తొలగిస్తారు.

ఇది కూడా చదవండి : Medaram: గద్దెనెక్కిన సారలమ్మ.. రేపు చిలుకలగుట్ట నుంచి తరలిరానున్న సమ్మక్క!

వారికి మాత్రమే రేషన్ సరుకులు..
ఈ నేపథ్యంలోనే ఈకేవైసీ కోసం రేషన్ షాపుల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. చాలా చోట్ల అప్‌డేట్ కావడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రేషన్ కార్డుల ఈకేవైసీ గడువును మరోసారి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 29లోగా అందరూ వివరాలను సమర్పించాలని స్పష్టం చేసింది. ఈకేవైసీ పూర్తి చేసిన కుటుంబ సభ్యుల వివరాలే.. రేషన్ కార్డులో ఉంటాయని.. వారికి మాత్రమే రేషన్ సరుకులు వస్తాయని తెలిపింది.

Advertisment
తాజా కథనాలు