ఇజ్రాయెల్‌లోని వైజ్‌మాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు మానవులు రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. ఇటీవల కొంతమందిపై వాళ్లు చేపట్టిన అధ్యయనంలో రోగ నిరోధక శక్తి బరువును కనుగొన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు 1.8 ట్రిలియన్ కణాలను కలిగి ఉండే ఇమ్యూన్ సిస్టమ్ వెయిట్.. 1 నుంచి 1.2 కిలోగ్రాముల బరువు ఉంటుందని గుర్తించారు.
Also read :పదేళ్ల బాలుడిని క్రూరంగా చంపేసిన కోతులు.. కడుపులోంచి పేగులు లాగి
అలాగే అనేక కణ రకాలు, విధులతో కూడిన సంక్లిష్ట వ్యవస్థగా పిలవబడుతున్న ఈ రోగనిరోధక వ్యవస్థ గురించి మెరుగైన అంతర్దృష్టిని పొందేందుకు మనిషిలో ఉండే కణాలన్నింటిని లెక్కించినట్లు తెలిపారు. గత పరిశోధనల నుంచి కొలతలను ఉపయోగించి, శరీరం చుట్టూ ఉన్న వివిధ కణజాల రకాల్లో ఎన్ని రోగనిరోధక కణాలు ఉన్నాయో అంచనా వేశాం. దీనిని ప్రతి కణజాల రకానికి చెందిన నమూనాల ప్రయోగశాల విశ్లేషణలతో కలిపాం. దాదాపు ఒకే వయస్సు గల అనేక మంది పురుషులు, మహిళలు.. అలాగే 10 సంవత్సరాల వయస్సు గల పిల్లల నుంచి నమూనాలను సేకరించాం. మొత్తానికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 73 కిలోగ్రాముల మనిషి 1.8 ట్రిలియన్ల రోగనిరోధక కణాలను కలిగి ఉంటాడని తేలింది. కాబట్టి రోగనిరోధక శక్తి కణాలు మొత్తంగా 1.2 కిలోల బరువు కలిగి ఉంటాయి' అని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. అలాగే 30 ఏళ్ల వయస్సులో ఉన్న 60 కిలోల స్త్రీకి 1.5 ట్రిలియన్ రోగనిరోధక కణాలు ఉండగా.. ఇమ్యూన్ సిస్టమ్ బరువు 1 కిలో ఉంది. 10 ఏళ్ల పిల్లల్లో సెల్ సంఖ్య 1 ట్రిలియన్‌కు తగ్గగా.. రోగనిరోధక శక్తి 0.6 కిలోల బరువు ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే దీనిపై మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయని, త్వరలోనే ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ వెల్లడిస్తామన్నారు.