Heat: రాబోయే 5 రోజుల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

ఏపీలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. నెల్లూరు, కావలి, తుని, అనంతపురం, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అన్నమయ్య జిల్లా ఆరోగ్యవరంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యాయి.

Weather: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో హీట్ వేవ్..ఐఎండీ హెచ్చరిక
New Update

High Temperature in Andhra Pradesh: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు (Summer)  రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మార్చి రెండవ వారం నుంచే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఏపీలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. నెల్లూరు, కావలి, తుని, అనంతపురం, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అన్నమయ్య జిల్లా ఆరోగ్యవరంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యాయి.


ఏపీలో అత్యథికంగా నంద్యాల జిల్లాలోని పాణ్యంలో 43. 7 డిగ్రీలు నమోదు అయ్యాయి. గ్రామీణ మండలాల్లో 43.3 డిగ్రీలు, తిరుపతి గూడూరులో 42. 3 డిగ్రీలు నమోదు అయ్యాయి. వచ్చే రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

సోమవారం నుంచి పలు జిల్లాల్లో తీవ్రంగా వడగాలులు వీస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో కూడా వడగాలులు తీవ్రంగా వీచే అవకాశాలున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంత ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీళ్లు ఎక్కువగా తాగాలని, పుచ్చకాయ, దోసకాయ వంటివి ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు తెలిపారు.

కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, బార్లీ నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని తెలిపారు. వడగాల్పుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

Also read: ఏప్రిల్‌-జూన్‌ లో మరింత వేడి…ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండండి: ఐఎండీ!

#ap #imd #summer #heat #ap-weather-report
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe