Rain Alert in Telangana: తెలంగాణలో వర్షాల గురించి వాతావరణ శాఖ (IMD) కీలక అప్డేట్ ఇచ్చింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. శనివారం, ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే వీలున్నట్లు చెప్పారు.
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. పగలంతా ఉక్కపోతగా ఉండగా..రాత్రి పది దాటిన తరువాత చలి విపరీతంగా కురుస్తుంది. శీతాకాలం ప్రారంభం అయ్యి చాలా రోజులు అయినప్పటికీ కూడా పగలు ఉక్కపోతతో వేసవికాలంలో ఉన్నామా అనే సందేహం వస్తుంది.
Also read: భారీ భూకంపం.. 128కి చేరిన మృతుల సంఖ్య
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని చెప్పింది. అందువల్లే వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నట్లు అధికారులు వివరించారు. శుక్రవారం నాడు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్టోగ్రతలు నమోదు అయ్యాయి.
ఖమ్మం నగరంలో సాధారణం కన్నా అధికంగా 4.8 డిగ్రీలు అధికంగా 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా భద్రాచలం పట్టణంలో 2.7 డిగ్రీలు నమోదు అయ్యింది. ఆదిలాబాద్ లో 2.3 డిగ్రీలు , హనుమకొండలో 1.2 డిగ్రీలు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
గత నాలుగు రోజుల నుంచి రాత్రి పూట కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల ఏపీలోని (AP) అల్లూరి జిల్లా, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ జిలాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Also Read: బంగారం ధర అలా.. వెండి ధరలు ఇలా.. ఈరోజు గోల్డ్ రేట్స్ ఇవే..