Rain Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు తేలికపాటి నంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే మంగళవారం నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్‌ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి.

New Update
Rain Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

Rain Alert in Telangana: తెలంగాణలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్‌ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. అయితే నిజామాబాద్‌ జిల్లా ఎడపెల్లి మండలం జానకంపేటలో అత్యధికంగా 5.1 సెం.మీ వర్షం కురిసింది. ఇక నిజామాబాద్‌ నార్త్‌లో 4.35 సెం.మీ, నిజాంపేటలో 3.58సెం.మీ.లు, కల్దుర్తి, గోపన్‌పల్లిలలో 3.45సెం.మీ.లు, చిన్నమావంధిలో 3.15సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.

Also Read: టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్‌ కంపెనీ..

Advertisment
తాజా కథనాలు