AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన...పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలు!

ఏపీలో సోమవారం భారీ వర్షాలు కురుస్తుయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ తమిళనాడులో కొనసాగుతున్న ఆవర్తనం కారణంగా మహారాష్ట్ర నుంచి సౌత్‌ తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

New Update
Rains: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తూఫాన్ ఎఫెక్ట్..!

AP: ఏపీలో సోమవారం భారీ వర్షాలు కురుస్తుయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ తమిళనాడులో కొనసాగుతున్న ఆవర్తనం కారణంగా మహారాష్ట్ర నుంచి సౌత్‌ తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 22వ తేదీ నాటికి మరింత బలపడి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

కాగా, ఈ నెల 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది.అలాగే, నేడు ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, పలు వర్షం పడే సమయంలో పిడుగులు కూడా పడే అవకాశం కూడా ఉన్నట్లు వివరించింది. ఈదురుగాలులు కూడా బలంగా వీచే ఛాన్స్ ఉందిని.. పొలాల్లో పని చేసే వారందరూ చెట్ల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Also read: తిరుమల వెళ్లాలనుకుంటున్నారా.. అయితే వాయిదా వేసుకోండి.. ఎందుకంటే!

Advertisment
తాజా కథనాలు