/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Rains-2.jpg)
Heavy Rainfall Alert: రానున్న ఐదురోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం నుంచి మంగళవారం వరకు వరంగల్, హన్మకొండ, కరీంనగర్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల,సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ తెలిపింది.
Also Read: అసోంని వీడని వరద ముప్పు
పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంగళవారం నుంచి బుధవారం వరకు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల ,ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ పేర్కొంది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌తోపాటు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వాన పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు వివరించారు.
ఈ నెల 18, 19 తేదీల్లో ఉత్తర తెలంగాణలోని ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇష్యూ చేసింది.