ileana : నాపై డైరెక్టర్స్ కి అలాంటి అభిప్రాయం ఉంది.. అందుకే తెలుగులో ఛాన్సులు లేవు - ఇలియానా షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్న ఇలియానా ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో తాను హిందీ సినిమాల్లోనే నటిస్తున్నానని, దక్షిణాది సినిమాల్లో నటించననే తప్పుడు అభిప్రాయం దర్శక నిర్మాతలకు ఉండటంతో సౌత్ లో అవకాశాలు రావడం లేదని చెప్పింది

ileana : నాపై డైరెక్టర్స్ కి అలాంటి అభిప్రాయం ఉంది.. అందుకే తెలుగులో ఛాన్సులు లేవు  - ఇలియానా షాకింగ్ కామెంట్స్
New Update

Actress Ileana About South Offers : టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది గోవా బ్యూటీ ఇలియానా. రామ్ పోతినేని సరసన 'దేవదాస్' సినిమాతో హీరోయిన్ తెలుగు వెండితెరకు పరిచయం అయిన ఇలియానా.. 'పోకిరి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది.

'పోకిరి' ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో ఈ హీరోయిన్ కి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. దాంతో టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. ఆ తర్వాత తమిళంలోనూ నటించినా.. అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. సౌత్ లో స్టార్ గా వెలుగొందుతున్న టైం లో ఇలియానా చేసిన ఒక్క మిస్టేక్ ఆమె కెరీర్ నే నాశనం చేసేసింది.

ఆ తప్పే ఇలియానా కెరీర్ ని నాశనం చేసిందా?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న టైం లోనే ఇలియానా 'బర్ఫీ' మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీ సినిమాలు చేస్తూనే సౌత్ డైరెక్టర్స్ ని కించపరిచేలా కామెంట్స్ చేసింది. దాంతో ఇలియానాను సౌత్ డైరెక్టర్స్ పట్టించుకోవడమే మానేశారు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్న ఇలియానా ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో తనకు సౌత్ నుంచి ఆఫర్స్ ఆగిపోవడం గురించి మాట్లాడింది.

Also Read : సినిమాల్లోకి కష్టంగా పవన్ కళ్యాణ్.. సంచలన నిజాలు బయటపెట్టిన చిరంజీవి!

అందుకే సౌత్ లో అవకాశాలు రావడం లేదు

తాజా ఇంటర్వ్యూ లో ఇలియానా మాట్లాడుతూ.." నేను తెలుగు, తమిళ సినిమాలు చేస్తున్న సమయంలో హిందీ మూవీ బర్ఫీ లో ఛాన్స్ వచ్చింది. అది మంచి కథ కావడంతో దాన్ని వదులుకోలేకపోయాను. దాంతో హిందీ సినిమాల్లోనే నటిస్తున్నానని, దక్షిణాది సినిమాల్లో నటించననే తప్పుడు అభిప్రాయం దర్శక నిర్మాతలకు వచ్చింది. అందుకే నాకు సౌత్ లో అవకాశాలు రావడం లేదు" అని చెప్పుకొచ్చింది.

#ileana-dcruz #actress-ileana #ileana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe