Vijayawada: తాగుబోతు భర్తకు డిఫరెంట్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన భార్య

సముద్రాన్ని ఈదొచ్చు కానీ.. సంసారాన్ని ఈదడం చాలా కష్టమని పెద్దలు అంటారు. జీవితాంతం తోడు ఉండాల్సిన భర్త విపరీతమైన కష్టాలు పెడుతుంటే భార్యలు తట్టుకోలేక ఎంతకైనా తెగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. తాగుబోతు భర్తను శ్రావణి ఎందుకు అలా చేసింది?.. భర్తపై అంత కోపం రావడానికి కారణం ఏంటి?

New Update
Vijayawada: తాగుబోతు భర్తకు డిఫరెంట్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన భార్య

మరిగే వేడి నీళ్ళను మీద పోసింది

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ (Vijayawada)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాగుబోతు భర్త వేధిస్తున్నాడని సలసల మరిగే వేడి నీళ్ళను మీద పోసింది ఓ భార్య. మద్యం మత్తులో నిద్రపోతున్న సమయంలో వేడి వేడి నీళ్ళు పోసి హత్యాయత్నానికి పాల్పడింది ఓ మహిళ. దీంతో అతడి ఒళ్లంతా బొబ్బలెక్కి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. విజయవాడ చిట్టినగర్‌ (Vijayawada Chittanagar) లో గత కొంత కాలంగా దుర్గారావు, శ్రావణి దంపతులు నివాసముంటున్నారు. ఓ అల్యూమీనియం కంపెనిలో పని చేస్తూ దుర్గారావు జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే కొన్ని రోజులుగా మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. రోజు తాగి వచ్చి ఇంట్లోవారితో గొడవ పెట్టుకునేవాడు. తాగినమైకంలో భర్త వేధింపులు ఎక్కువ కావడంతో సహనం కోల్పోయిన శ్రావణి కోపంతో రగిలిపోయి ఈ దారుణానికి పాల్పడింది.

దుర్గారావు ఆరోగ్య పరిస్థితి విషయం

రెండు రోజుల క్రితం (ఈనెల 27వ తేదీ)న ఆదివారం ఫుల్లుగా మందు తాగి దుర్గారావు ఇంటికి వచ్చాడు. తాగినమైకంలో శ్రావణి ( Shravani)తో గోడవపడి.. ఆ మత్తులోనే వెళ్లి మంచంపై పడుకున్నాడు. కోపంతో ఉన్న శ్రావణి సలసల కాగే వేడినీటిని పడుకున్న భర్త దుర్గారావు మీద పోసింది. దీంతో అతడి శరీరమంతా కాలి గాయలయ్యాయి. దుర్గారావు ఛాతీ, ముఖం, వీపు, రెండు చేతులపై బొబ్బలు వచ్చి పరిస్థితి విషయంగా ఉంది. ప్రస్తుతం దుర్గారావు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. కొంతకాలంగా దంపతులు మధ్య గొడవలు ఉన్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. భార్యపై దుర్గారావు (Durga Rao) ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన టూ టౌన్‌ పోలీసులు (Two Town Police) దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 40 శాతం శరీరం కాలిపోవడంతో దుర్గారావు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు