CM Revanth Reddy: మార్చి 15న సీఎం రేవంత్ రెడ్డి ఇఫ్తార్ విందు..వేదిక వివరాలివే.!

New Update
CM Revanth Reddy: మార్చి 15న సీఎం రేవంత్ రెడ్డి ఇఫ్తార్ విందు..వేదిక వివరాలివే.!

CM Revanth Reddy:  హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో ఈనెల 15వ తేదీన ఇఫ్తార్ విందు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలని సీఎఎస్ ను ఆదేశించారు. ప్రతిఏటా తెలంగాణ సర్కార్ ముస్లీంలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయడంతోపాటు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ముస్లిం మతపెద్దల సమక్షంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొనే ఈ రంజాన్ కరీం ను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: అహ్మద్‌నగర్‌కు ‘అహల్యానగర్’గా పేరు మార్చిన మహారాష్ట్ర సర్కార్..!

రంజాన్ ఉపవాసం ఉంటున్నారా? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి: 

రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం వల్ల డయాబెటిస్(Diabetes) ఉన్నవారు అనేక సవాళ్లను ఎదుర్కొంటారని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువసేపు ఖాళీ కడుపు కలిగి ఉండటం వల్ల ఇన్సులిన్ తగ్గుతుంది.

–> గుండె సమస్యలు(Heart Problems), రక్తపోటుతో బాధపడేవారు కూడా రంజాన్ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మందులు తీసుకునే వ్యక్తులు ఉపవాసానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి.

–> డీహైడ్రేషన్‌ ఆరోగ్యానికి అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఇది తక్కువ రక్తపోటు, అలసట, మైకము ప్రమాదాన్ని పెంచుతుంది.

–> ఉపవాసం ప్రారంభించేటప్పుడు పుష్కలంగా నీరు త్రాగాలి. పుచ్చకాయ, దోసకాయలు లాంటి హైడ్రేటింగ్ ఆహారాన్ని తినండి.

–> ఉపవాసం సమయంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, కార్బోహైడ్రేట్లు, సన్నని ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు , ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారాన్ని ఎంచుకోండి. జీర్ణ సమస్యలను నివారించడానికి ఇఫ్తార్ సమయంలో వేయించిన లేదా తీపి పదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం మానుకోండి. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్‌ను తప్పకుండా చేర్చుకోండి.

–> రోజంతా స్థిరమైన శక్తిని అందించడానికి తృణధాన్యాలు, గుడ్లు , పెరుగు లాంటి నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోండి. అధిక కెఫిన్, ఉప్పగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి.

Advertisment
తాజా కథనాలు