Health Tips: తినేటప్పుడు ముక్కు నుంచి నీరు వస్తే..నిపుణులు ఏమంటున్నారు?

ప్రతిరోజు మనం అనేక రకాల ఆహారాలను తింటూ ఉంటాం. కొందరు తీపి వస్తువులు, పులుపును కారం ఉండే పదార్థాలను ఇష్టంగా తింటారు. ఆహార పదార్థాలు తింటుంటే, తిన్న తర్వాత నుంచి ముక్కులో నీరు కారుతూ ఉంటుంది. అందుకే నచ్చని ఆహారం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి.

New Update
Health Tips: తినేటప్పుడు ముక్కు నుంచి నీరు వస్తే..నిపుణులు ఏమంటున్నారు?

Nose Gets Watery: ప్రతిరోజు మనం అనేక రకాల ఆహారాలను తింటూ ఉంటాం. కొందరు తీపి వస్తువులు ఇష్టంగా తింటారు. మరికొందరు పులుపును అధికంగా తింటుంటారు. అలాగే కొందరికి కారం ఉండే పదార్థాలు అంటే ఇష్టం. ఎవరి రుచికి తగ్గట్టుగా వారు ఆహారం తీసుకుంటారు. కానీ చాలామందికి పులుపు, కారం, ఘాటు ఉన్న ఆహార పదార్థాలు తింటుంటే, తిన్న తర్వాత నుంచి ముక్కులో నీరు కారుతూ ఉంటుంది. అనేక మందికి ఇలా జరుగుతుంది. అయితే ఇలా జరగటం హానికరమా?, ఇలా జరగడానికి గల కారణాలేంటి?, నిపుణులు ఏం చెబుతున్నారు.. ఇప్పుడు తెలుసుకుందాం.
ముక్కు నుంచి నీరు కారితే...
ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు మన ముక్కు నుంచి నీరు కారితే దాన్ని వైద్యులు గస్టేటరీ రైనైటిస్ అని పిలుస్తారు. కొందరికి ఆహారం తినే సమయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. మరికొందరికి అయితే ఆహారం తిన్న తర్వాత ముక్కు నుంచి నీళ్లు వస్తాయి. అయితే పులుపు, ఘాటు, కారం తింటే వెంటనే ఇలా జరుగుతుంది. దీనికంటూ ఒక ప్రత్యేక కారణాలు ఉండవని వైద్యులు అంటున్నారు. మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా చాలామందికి ఇలా జరుగుతుందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఇలా చేస్తే క్యారెట్లు వాడిపోకుండా ఫ్రెష్‌గా ఉంటాయి
ఇది సహజ సిద్ధంగానే జరుగుతుందని, ఇలా జరగడం వల్ల మన శరీరానికి ఎలాంటి హాని జరగదని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఆహారం తినేటప్పుడు ముక్కు నుంచి నీళ్లు వస్తే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. కాకపోతే ఫుడ్ ఎలర్జీలు ఉన్నా ఇలాగే ముక్కులో నుంచి నీళ్లు వస్తాయని, ఫుడ్ ఎలర్జీలు ఉన్నవారు నచ్చని ఆహారాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. అందుకే నచ్చని ఆహారం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ధ్యానం వల్ల ఇన్ని లాభాలున్నాయా..? ప్రతిరోజు ధ్యానం చేస్తే అద్భుత ఫలితాలు

Advertisment
తాజా కథనాలు