బరువు తగ్గాలంటే..ఈ సలాడ్స్ మీ డైట్లో చేర్చుకోండి..కొవ్వు వెన్నలా కరిగిపోతుంది..!!

ఊభకాయం, బరువు తగ్గడం ఇది చాలా కష్టమైన ప్రక్రియ. అయితే అధికబరువుతో బాధపడుతున్నవారు ఈ చిట్కాలు ఫాలో అవుతే సులభంగా బరువు తగ్గుతారు. అవేంటో చూద్దాం.

New Update
బరువు తగ్గాలంటే..ఈ సలాడ్స్ మీ డైట్లో చేర్చుకోండి..కొవ్వు వెన్నలా కరిగిపోతుంది..!!

నేటికాలంలో చాలా మంది అధికబరువు, ఊభకాయం సమస్యతో బాధపడుతున్నారు. చిన్నవయస్సులోనే ఊభకాయం సమస్య వేధిస్తోంది. దీనికి కారణం మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు. అయితే చాలా మంది బరువు తగ్గేందుకు ఎన్నో పద్దతులు, చర్యలు తీసుకుంటున్నారు. అయినాకూడా వారు బరువు తగ్గడంలేదు. కొంతమంది కొవ్వు కరిగించేందుకు జిమ్ లో గంటల తరబడి చెమటలు కారేలా వ్యాయామాలు చేస్తున్నారు. అయినా కూడా ప్రయోజనం మాత్రం సున్నా.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుస్తే షాక్ అవుతారు..!!

వ్యాయామంతోపాటు ఏం తినాలి..ఎప్పుడు తినాలనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్య నిపుణుల ప్రకారం..మీ ఆహారంలో సరైన మొత్తంలో ఫైబర్, ప్రొటిన్స్ చేర్చుకోవాలి. ఇవి అధిక బరువును నిరోధిస్తాయి. అధికబరువుతో బాధపడేవారికి కొన్ని సలాడ్స్ గురించి సమాచారం అందిస్తున్నాం. వీటిని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల అధిక బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

ఈ సలాడ్లు బరువు తగ్గడంలో మేలు చేస్తాయి:

1. బీట్‌రూట్ సలాడ్:
బీట్ రూట్ సలాడ్ చేయడానికి, మీకు 1 కప్పు పెరుగు, 1 తరిగిన ఉల్లిపాయ, ఉప్పు, రుచి ప్రకారం నల్ల మిరియాలు, తురిమిన బీట్‌రూట్ అవసరం. వీటన్నింటిని ఒక బౌల్లో వేసి బాగా కలపండి. ఈ సలాడ్‌ని లంచ్ లేదా బ్రేక్‌ఫాస్ట్‌లో క్రమం తప్పకుండా తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

ఇది కూడా చదవండి:  ఈ మూడు కలిపి తింటే..ఆ ఎనిమిది రోగాలు ఫసక్..!!

2. వైట్ గ్రామ్ సలాడ్:
వైట్ గ్రామ్ సలాడ్ చేయడానికి, ముందుగా మీకు 1 కప్పు ఉడికించిన చిక్‌పీస్, 1 తరిగిన ఉల్లిపాయ, టొమాటో, దోసకాయ, 1 టీస్పూన్ నిమ్మరసం, రుచికి తగిన ఉప్పు, మిరియాలు. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుని కలపండి. వీటిని నిత్యం మీ డైట్లో చేర్చుకునే ప్రయత్నం చేయండి.

3. మొలకెత్తిన సలాడ్:
స్ప్రౌట్ సలాడ్ ఆరోగ్యానికి చాలా ఎంతో సహాయపడతాయి.వీటిని తీసుకోవడం ద్వారా, బరువు తగ్గుతారు, కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే, మీ ఆహారంలో ఖచ్చితంగా చేర్చుకోండి. ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్టులో వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.

(Disclaimer:ఈ కథనం ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగానే ఇవ్వబడింది. ఆర్టీవీ(RTV) దీన్ని ధృవీకరించలేదు, బాధ్యత వహించదు. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం)

Advertisment
Advertisment
తాజా కథనాలు