Jio Number: చాలా మంది తమకు నచ్చిన ఫోన్ నెంబర్(Phone number) కావాలని కోరుకుంటారు. నచ్చిన నెంబర్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మనకు నచ్చిన నెంబర్ దొరకడమనేది చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు సులభం చేసింది జియో (Jio ).ముఖ్యంగా ఫ్యాన్సీ నెంబర్ కావాలని ఒక్కప్పుడు చాలా సెర్చే చేసేవారు. అయితే ఈ ఆ కష్టాలకు చెక్ పెట్టింది. జియో పోస్ట్ పెయిడ్ (Jio Post Paid)లేదా ప్రీపెయిడ్(prepaid) కస్టమర్లు తమకు నచ్చిన నెంబర్లను సెలక్ట్ చేసుకునే వీలు కల్పించింది. జియో కల్పించిన ఈ ఛాన్స్ తో మీ లక్కీ నెంబర్,(lucky number,) పుట్టినరోజు మొదలైన వాటితో మీ మొబైల్ నెంబర్ ను సెట్ చేసుకోవచ్చు.
మీకు నచ్చిన జియో నెంబర్ ఇలా పొందడి:
-మీ మొబైల్లో jio.com లేదంటే myjioapp కు లాగిన్ అవ్వండి. అందులో సెల్ఫ్ కేర్ సెక్షన్(Self Care Section) లోకి వెళ్లండి.
-jio.com అయితే ఛాయిస్ నెంబర్ సెక్షన్ (Choice No. Sec) యాప్ లో అయితే ఛాయిస్ నెంబర్ ఆప్షన్స్ పై క్లిక్ చేయాలి.
- మొబైల్ నెంబర్లలోని చివరి 4 లేదా 6 నెంబర్లను మీరు కోరుకున్నట్లు మార్చుకోవాలి.
- ఇప్పుడు పేమెంట్ సెక్షన్ లోకి వెళ్లి రూ. 499 చెల్లించండి.
- పేమెంట్ పూర్తయిన తర్వాత 24 గంటల్లో మీరు సెలక్ట్ చేసుకున్న జియో నెంబర్ యాక్టివేట్ అవుతుంది.
ఇది కూడా చదవండి: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. తప్పక పాటించాల్సిన హెల్త్ టిప్స్ ఇవే!