Health Care Tips: గీజర్ వాడితే జుట్టు ఊడుతుందా?..నిపుణులు ఏమంటున్నారు? చాలా మందిలో గీజర్ వాటర్ వాడటం గురించి అనేక సందేహాలుంటాయి. కొంతమంది జుట్టు ఊడుతుందని, చిన్న పిల్లలకు మంచిది కాదని అనుకుంటారు. అయితే అది నిజం కాదని.. గీజర్ వాటర్ తో స్నానం చేయడం వల్ల జుట్టు రాలదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 02 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Health Care Tips: గత కొన్ని సంవత్సరాలుగా గీజర్ల వాడకం బాగా పెరిగింది. ప్రస్తుత కాలంలో గీజర్లు ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉంటూనే ఉంది. నీటిని వేడి చేసుకోవడానికి పొయ్యి, గ్యాస్ వంటివి లేకుండా ఇప్పుడు డైరెక్ట్‌గా గీజర్లు వాడుతున్నారు. అంతేకాదు వీటి వాడకం ఎక్కువగా పెరిగింది. ప్రత్యేకంగా కాచే పని లేకుండా, తీసుకెళ్లకుండా నేరుగా ఇప్పుడు బాత్ రూమ్స్‌లోనే వేడి నీళ్లు వస్తాయి. అయితే.. కరెంట్‌తో వేడి చేసిన నీళ్లతో స్నానం చేస్తే పలు రకాల సమస్యలు ఉన్నాయా..?, ఈ నీళ్లతో హెడ్ బాత్ చేస్తే జుట్టు రాలి పోతుందా..? అనే పలు రకాల అనుమానాలు చాలా మందికి ఉంటాయి. కరెంట్ ద్వారా హీట్ ఎక్కిన వాటర్‌తో స్నానం చేస్తే పలు రకాల దుష్ఫ్రభావాలు ఉన్నాయా?, ఈ వాటర్‌తో తలస్నానం చేస్తే జుట్టు రాలి పోతుందా? అనేక రకాల అనుమానలుంటాయి. మరి వీటిల్లో నిజమెంత అనేది ఆలస్యం లేకుండా ఇప్పుడు తెలుసుకుందాం. గీజర్ వాటర్ వాడితే కలిగే ప్రయోజనాలు గీజర్ వాటర్‌తో తల స్నానం చేసేటప్పుడు పలు జాగ్రత్తలు అవసరం. గీజర్ వాటర్‌తో స్నానం బాత్ చేస్తే ఎలాంటి సమస్యలు రావు. కొందరి శరీర తత్వం బట్టి ఇది ఉంటుంది. అయితే గీజర్ వాటర్‌తో స్నానం చేసేటప్పుడు జుట్టు రాలితే మీకు అది పడటం లేదని గమనించాలి. గీజర్ వాటర్ అనేది కరెంట్‌తో వేడి అవుతాయి. నీరు వేడెక్కడం వల్ల సూక్ష్మ జీవులు, బ్యాక్టీరియా, వైరస్ వంటివి ఏమైనా ఉంటే చనిపోతాయి. దీంతో ఈ నీరు సురక్షితంగా ఉంటాయి. అయితే..వేడి నీటితో స్నానం చేయకూండ.. కేవలం గోరు వెచ్చటి నీటితో మాత్రమే స్నానం చేయాలని గుర్తు ఉంచుకోవాలి. గీజర్ వాటర్‌తో స్నానం చేస్తే ఎలాంటి నష్టాలు ఉండవు. వేడి వేడి నీటితో తలస్నానం చేస్తేనే జుట్టు కుదుళ్లలో ఉండే సహజమైన నూనెలు పోతాయి. జుట్టు కూడా పొడి బారి పోతుంది. అందుకే మరీ వేడిగా ఉన్న వాటర్‌తో కాకుండా.. గోరు వెచ్చగా ఉన్న నీటితో తల స్నానం చేయాలని అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా పసి పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వారికి ఎక్కువ వేడి లేకుండా ఈ నీటితో స్నానం చేయించినా ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవు. కొందరికి మరీ ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోరు వెచ్చటి నీటితో మాత్రమే స్నానం చేయడం ఉత్తమం అంటున్నారు. మామూలుగా ఎక్కువగా వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేస్తే ఈ సమస్య వస్తుంది. బాగా ఎక్కువ వేడి నీటితో కాకుండా గోరు వెచ్చటి నీటితో స్నానం చేస్తే పెద్దగా జుట్టు సమస్యలు రాకపోవచ్చు. ఇది కూడా చదవండి: ఆకు కూరలు ఇంట్లో తాజాగా ఉండాలంటే ఇలా చేయండి #health-benefits #geyser-water #blow-hair మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి