HAIR : అందాన్ని కాపాడటంలో కాఫీ కీ రోల్!

అందాన్ని కాపాడడంలో కాఫీ కీ రోల్ పోషిస్తుంది. కాఫీని వాడడం వల్ల చర్మానికి, జుట్టుకి చాలా మంచిది. దీనిని వాడడం వల్ల జుట్టు కూడా స్ట్రాంగ్‌గా మృదువుగా మారుతుందట. అందుకోసం కాఫీని ఎలా వాడాలి.. దీని వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకోండి.

New Update
HAIR : అందాన్ని కాపాడటంలో కాఫీ కీ రోల్!

Beauty Tips : ఓ పాత్రలో నీరు పోయండి. అందులో కాఫీ(Coffee) పొడి వేసి వేడి చేయాలి. దీనిని తలస్నానం(Head Bath) చేసేటప్పుడు తలస్నానం తర్వాత ఈ డికాషన్‌తో జుట్టుని క్లీన్ చేయండి. రోజూ కాఫీ తాగడం(Drinking Tea) వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. దీని వల్ల చర్మం, శరీరానికి చాలా మంచిది జుట్టు పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది.కోల్డ్ కాఫీని రోజ్‌మేరీ, జోజోబా ఆయిల్, గ్రేప్ సీడ్ ఆయిల్‌తో మిక్స్ చేసి తలకు మసాజ్(Head Massage) చేయండి. దీని వల్ల జుట్టుకి చాలా మంచిది. దీంతో పాటు కాఫీ పొడిని క్యారియర్ ఆయిల్‌తో తలకి అప్లై చేసి మసాజ్ చేయండి. దీని వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.మరిగించిన కాఫీ నీటిని పెరుగు, తేనె, వెన్నతో కలపి తలకి అప్లై చేయాలి. ఇది మంచి ప్యాక్ అని చెప్పొచ్చు. 20 నుంచి 30 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. దీని వల్ల జుట్టు స్ట్రాంగ్, షైనీగా మారుతుంది. కాఫీ పొడిని స్క్రబ్‌లా వాడొచ్చు. దీనికోసం కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్‌తో కాఫీ పొడిని మిక్స్ చేయాలి. దీనిని స్కాల్ప్‌పై స్క్రబ్‌గా వాడొచ్చు. దీని వల్ల రక్తప్రసరణని మెరుగుపరుస్తుంది. మృతకణాలను తొలగిస్తుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది.

కాఫీ జుట్టుకి మంచి రంగుని కూడా ఇస్తుంది. షాంపూ చేసిన తర్వాత కాఫీ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయండి. వారానికి ఒకట్రెండు సార్లు కాఫీని జుట్టుకి అప్లై చేస్తే చాలా మంచిది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. దీనిని జుట్టుకి అప్లై చేసి మసాజ్ చేస్తే హెల్దీగా పెరుగుతుంది. కాఫీ మీ తలకి రక్తప్రసరణని పెంచుతుంది. దీంతో పాటు సహజరంగుని ఇస్తుంది. జుట్టు పెరుగుదలని ప్రేరేపిస్తుంది. తెల్ల వెంట్రుకలని దూరం చేస్తుంది. కాబట్టి, రెగ్యులర్‌గా అప్లై చేయడం మంచిది.

Also Read : ఇవి తింటే వందేళ్లు వచ్చినా కాల్షియలోపం ఉండదు

Advertisment
Advertisment
తాజా కథనాలు