ఒకప్పుడు కేవలం మాట్లాడుకోవడానికే పరిమితమైన ఫోన్..క్రమంగా టెక్నాలజీ పెరిగి ప్రతి ఒక్క పని సెల్‌ఫోన్ లేనిదేకావడం లేదు.అంతగా మన జీవన విధానంతో మమేకమైపోయింది. ఫోన్ లేకపోతే ఉండలేని పరిస్థితి వచ్చింది.సెల్‌ఫోన్ ఒక్కక్షణం పక్కన లేకపోతే నిద్రకూడా పోవడం లేదు. కొన్ని సంఘటనల్లో అయితే ఫోన్ కోసం ప్రాణాలు తీసుకోవడం కూడా చూస్తూనే ఉన్నాం. కొందరికి అయితే పొద్దున లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ వాడకపోతే అస్సలు పొద్దుపోదు. అంతలా కంట్రోల్ లేకుండా అయిపోయింది. అధికంగా ఫోన్ వాడితే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి
గంటల కొద్దీ ఫోన్ చూస్తూ ఉండటం వల్ల కళ్లు బాగా అలసిపోతాయని అంటున్నారు. అదేపనిగా డిజిటల్ స్క్రీన్ చూస్తూ ఉండటం వల్ల కంటి పొరలు పొడిబారిపోతాయని చెబుతున్నారు. దీంతో దృష్టి అస్పష్టంగా ఉండటం, తీవ్రమైన తలనొప్పితో పాటు అలసట వస్తాయి. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడితే నిద్రలేని సమస్య తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రి నిద్రపోయే సమయంలో ఫోన్ చూస్తే ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూలైట్.. నిద్రరావడానికి కారణమైన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది. లైట్ ఎక్కువ సేపు కంటిపై పడటం వల్ల నిద్రలేమి వస్తుందని, నిద్రలేమితో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రోజు మొత్తం సెల్‌ఫోన్ వాడితే మెడతో పాటు వెన్నెముక ఎక్కువసేపు వంగే ఉంటాయి. దీంతో దీర్ఘకాలం పాటు వెన్నెముక సమస్య తప్పదని హెచ్చరిస్తున్నారు. చేతిలో ఎక్కువ సమయం పాటు సెల్‌ఫోన్‌ను పట్టుకుని ఉంటే ఎల్బో వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఖాళీ కడుపుతో ఈ ఆకులను ఎప్పుడైనా తిన్నారా.? అద్భుతాలు తెలిస్తే వదలరు
ఫోన్ మాట్లాడే సమయంలో చేతిని ఎప్పుడూ మలుస్తూ ఉంటాం. ఎక్కువగా వాడితే చేతిని ఒకే సైడ్ ఉంచుతుంటాం. దీని వల్ల మోచేతి వద్ద ఉండే అల్నార్ నరం తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. దీంతో చేతికి తిమ్మెరులు వస్తాయి. మణికట్టు నుంచి మోచేతి దాకా నరం కూడా నొప్పి లేస్తుంది. అందుకే ఫోన్ వాడేటప్పుడు ఎక్కువ సేపు చేతిలో పట్టుకోకూడదని అంటున్నారు. ఫోన్‌లో అతిగా టైపింగ్ చేయడం, స్వైప్ చేస్తుండటం వల్ల మణికట్టుతో పాటు వేళ్లలో స్నాయువుతో పాటు కార్బల్ టన్నెల్ సిండ్రోమ్ వంటి రిపీట్ స్ర్ట్రెయిన్ ఇంజ్యూరిస్ వస్తాయి. ఉదయం లేచినదగ్గరి నుంచి ఫోన్‌లా చూస్తూ ఉంటే మానసిక స్థితిపైనా ప్రభావం పడుతుందని, ఒత్తిడి, తీవ్ర ఆందోళన కలుగుతాయని వైద్యులు అంటున్నారు. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల శారీరక శ్రమ, వ్యాయాయం లేక బాగా బరువు పెరుగుతారు, అంతేకాకుండా ఊబకాయంతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని, రేడియేషన్ వల్ల దీర్ఘకాలిక ఎక్స్పోజర్ క్యాన్సర్ కూడా వస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.