Health : బ్రకోలితో బరువు తగ్గండి!

బరువు తగ్గాలనుకునేవారు కేలరీలను కంట్రోల్ చేసుకోవాలి. అందులో భాగంగా పాలతో తయారైన టీ బదులు కొన్ని హెల్దీ డ్రింక్స్ తీసుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి.

New Update
Iron Deficiency: ఐరన్‌ లోపం ఉందా..? తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే

Broccoli Benefits : అధిక బరువు(Over Weight) తో ఉండేవారికి ఎక్కువ ఆకలి వేయటం సర్వసాధారణం. వారు బరువు తగ్గించుకునే వారు ఫుడ్స్, డ్రింక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. టీ, కాఫీలు టేస్టీగానే ఉంటాయి. కానీ, ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటి బదులుకొన్ని హెర్బల్ డ్రింక్స్(Herbal Drinks), హెల్దీ డ్రింక్స్(Healthy Drinks) తాగొచ్చు. అలాంటి కాఫీలలో బ్రకోలీ కాఫీ(Broccoli Coffee) కూడా ఒకటి. దీనిని ఎలా తయారు చేయాలి. తాగితే ఎలాంటి లాభాలో తెలుసుకోండి.

దీనిని తయారు చేయడం చాలా ఈజీ. బ్రకోలీని క్లీన్ చేసి ఎండలో బాగా ఆరబెట్టాలి. దీనిని పొడి కూడా చేసి పెట్టుకోవచ్చు. ఈ బ్రకోలీ పౌడర్‌ని మీ రెగ్యులర్ కాఫీ పౌడర్‌లో మిక్స్ చేయండి. 2 టేబుల్ స్పూన్ల బ్రకోలీ పౌడర్ ఓ కప్పు బ్రకోలీని తీసుకుంటే అదే మొత్తంలో పోషకాలను అందిస్తుంది. బ్రకోలీలో ప్రోటీన్స్, పీచు పదార్థాలు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.

బ్రకోలీ తింటే ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని యాంటీ క్యాన్సర్ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీర కణాల్లో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధించగలవు.
బ్రకోలీలోని ప్రోటీన్, ఫైబర్ జీర్ణక్రియనిమెరుగుపరుస్తుంది. శరీర జీవక్రియని పెంచి బరువు తగ్గడం(Weight Loss) లో సాయపడుతుంది. అందులో కాఫీ కలిపితే జీవక్రియ పెరుగుతుంది. కేలరీలు కూడా చాలా తక్కువ కాబట్టి, బరువు తగ్గడం ఈజీ అవుతుంది. ఈ బ్రకోలీ పౌడర్‌ని సూప్స్, స్మూతీస్, సలాడ్స్‌లో ఇలా రకరకాలుగా తీసుకోవచ్చు.

ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు, పీచు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. కొవ్వు నెమ్మదిగా కరుగుతుంది. త్వరగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా, బ్రకోలీలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కొవ్వుని తగ్గించడానికి అవసరమైన పోషకాలు.ఈ బ్రకోలీ కాఫీ బరువు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. కానీ, ఈ కాఫీ తాగలేకపోతే దీని బదులు.. బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, జీలకర్ర టీ, సోంపు టీ, పుదీనా టీ, తులసి టీ, లెమన్ టీ ఉదయం, సాయంత్రం నిద్ర లేవగానే తీసుకుంటే తక్కువ సమయంలో మంచి  రిజల్ట్స్ ఉంటాయి.

Also Read : కిడ్నీ వ్యాధి నుంచి దూరం చేసే సూపర్ ఫుడ్స్!

Advertisment
తాజా కథనాలు