Helth Benefits: ఈ సంకేతాలు కనిపిస్తే మీ కళ్లను టెస్ట్ చేయించుకోవాల్సిందే

సాధారణంగా మనం ఎక్కువశాతం చర్మం, జుట్టు ఆరోగ్యంపైనే శ్రద్ధ చూపిస్తుంటాం. కళ్ల గురించి పట్టించుకోం. ఏదైనా కంటి సమస్య వస్తే డ్రాప్స్‌ వేయించుకోవడం, విశ్రాంతి తీసుకోవడంవంటివి చేస్తుంటాం. అయితే రెండు కళ్లలో ఒక్కసారిగా నొప్పి వస్తే ముందుగానే జాగ్రత్తతో ఉంటే ఎలాంటి సమస్యలు రావు.

Helth Benefits: ఈ సంకేతాలు కనిపిస్తే మీ కళ్లను టెస్ట్ చేయించుకోవాల్సిందే
New Update

మన కళ్లు కొన్ని సార్లు టెస్ట్‌ చేయించుకోవాల్సిన సమయం వచ్చిందని మనల్ని హెచ్చరిస్తుంటాయి. ఈ సంకేతాలను నమం లైట్‌ తీసుకుంటే కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు వైద్య నిపుణులు. కొన్నిసార్లు కళ్ళలో అసౌకర్యం కార్నియా, నొప్పి, రెటీనాలో పెద్ద సమస్యలకు తారి తీస్తుందటాన్నారు. రెండు కళ్లలో ఒక్కసారిగా నొప్పి వస్తే వెంటనే డాక్టర్ల వద్దకి వెళ్లాలని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: వంకాయతో కూడా బరువు తగ్గొచ్చా?.. నిపుణులు ఏమంటున్నారు?

కంటికి ఏదైనా గాయం అయితే నొప్పి, వాపు ఉంటాయి. కళ్ల ముందు కొన్నిసార్లు లైట్‌ ఫ్లాష్‌లు కనిపిస్తాయి. ఇలాంటివి కనిపించగానే ఆలస్యం చేయకూడదని అంటున్నారు డాక్టర్లు. ఈ ఫ్లాష్‌లు రెటీనాలో సమస్య ఉందని చెప్పే సంకేతాలు అంటున్నారు. రెటీనా వేరుకావడం, చిరిగిపోయే అవకాశం ఉన్న టైంలో ఇలాంటి సంకేతాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కంటి మైగ్రేన్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి లైట్‌ ఫ్లాష్‌లు ఎక్కువగా కనిపిస్తాయిట.కళ్లు ఒక్కసారిగా కాంతికి సున్నితంగా మారినప్పుడు కంటి లెన్స్ మబ్బుగా ఉంటాయి. ఇది శుక్లం యొక్క సాధారణ పరిస్థితి.

కొన్ని సందర్భాల్లో మరణం వచ్చే అవకాశం

దీన్ని నిర్లక్ష్యం చేస్తే అస్పష్ట దృష్టి, ఒక కంటిలో డబుల్ దృష్టి, రాత్రి అంధత్వం వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఆకస్మిక దృష్టి కోల్పోవడం అనేది ఒక తీవ్రమైన కంటి సమస్య అని అంటున్నారు. ఇది స్ట్రోక్ ప్రారంభ సంకేతం అని వైద్యులు అంటున్నారు. శరీరంలోని రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడటంతో స్ట్రోక్ సమస్య వస్తుంది. దీనివలన పక్షవాతంతో పాటు..మెదడు పనితీరుపై ప్రభావం పడుతుంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మరణం వచ్చే అవకాశం కూడా ఉందటున్నారు. కనురెప్పల్లో తరచుగా దురద వస్తుంటే కళ్ల చుట్టూ సమస్య ఉన్నటే.. దీన్ని నిర్లక్ష్యం చేస్తే కళ్లపై ఎక్కువ ప్రభావం పడుతుంది. నిత్యం కళ్లు మంటగా అనిపించినా, కంటి నుంచి ఏకధాటిగా నీరు వస్తున్నా ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్లను కలిస్తే సమస్య త్వరగా పోతుంది. అయితే.. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి నుంచి వైరస్ ఇతర వ్యక్తులకు వస్తుంది. కంటి స్రావాలు, చేతుల ద్వారా ఇది చేరుతుంది. అందుకే ఎక్కువ శాతం, తెలిసీ తెలియక చేతులు కళ్లలో పెట్టుకోవద్దని వైద్యులు చెబుతున్నారు.

#helth-benefits #eyes
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe