Pan Card : పాన్‌ కార్డ్‌ పోయిందా? ఎవరైనా దొంగిలించారా? అయితే ఇలా చేయండి!

మన దేశంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను ప్రభుత్వం పాన్ కార్డు ఆధారంగానే ట్రేస్ చేస్తుంది. అయితే ఈ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ పోతే బాధపడాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో పాన్ కార్డ్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి ఫాలో కావలసిన స్టెప్స్‌ ఏంటో తెలుసుకోవడానికి ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Pan Card : పాన్‌ కార్డ్‌ పోయిందా? ఎవరైనా దొంగిలించారా? అయితే ఇలా చేయండి!

PAN Card Steps To Do These : ఆధార్ కార్డ్(Aadhaar Card), డ్రైవింగ్ లైసెన్స్(Driving License), ఓటర్ ఐడీ కార్డ్(Voter ID Card), పాన్‌ కార్డ్‌(PAN Card).. ఇవి చాలా ఇంపార్టెంట్‌ డాక్యుమెంట్స్‌. ఇవి లేకపోతే మీ పనులు నిలిచిపోవచ్చు. అందుకే చాలామంది వీటిని క్యారీ చేస్తుంటారు. కొన్ని చోట్ల డిజిటల్‌ కార్డ్‌(Digital Card) తో పని అవుతుంది కానీ కొన్ని చోట్ల మాత్రం ఈ డాక్యుమెంట్స్‌ ఒరిజినల్‌వి చూపించాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఈ కార్డులు పోగొట్టుకోవచ్చు.. లేదా ఎవరైనా చోరీగాడు దొంగిలించవచ్చు. అలానే మీక్కూడా జరిగిందా? పోని భవిష్యత్‌లో జరగదని గ్యారెంటీ లేదు కదా.. ముఖ్యంగా మీ పాన్‌ కార్డు చోరీకి గురైతే చాలా ప్రమాదం. దాన్ని చాలా మిస్‌యూజ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ పాన్ కార్డ్ ముఖ్యమైన డాక్యుమెంట్ కేటగిరీలోకి వస్తుంది. అయితే కార్డు పోగొట్టుకున్నంత మాత్రానా టెన్షన్‌ వద్దు. అలా జరిగినప్పుడు ఏం చేయాలో తెలుసుకోండి..!

మీరు పాన్ కార్డ్‌ని మళ్లీ ఇలా తయారు చేసుకోవచ్చు:

స్టెప్‌ 1:
--> దీని కోసం మీరు ముందుగా NSDL onlineservices.nsdl.com/paam/ReprintEPan.html అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

--> అప్పుడు ఒక పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ మీరు మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ లాంటి సమాచారాన్ని పూరించాలి.

స్టెప్ 2:

--> దీని తర్వాత మీరు GSTN నంబర్, కాలమ్‌ను పొందుతారు. దాన్ని వదిలివేసి T అండ్‌ Cపై క్లిక్ చేయండి.

--> ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ను ఫిల్‌ చేసి సబ్మిట్ చేయాలి.

--> మీరు దీన్ని చేసిన వెంటనే, మీ సమాచారం మొత్తం మీకు కనిపిస్తుంది.

--> ఇప్పుడు మీ అడ్రెస్‌, పిన్ కోడ్‌ను ఇక్కడ ఫిల్ చేయండి. మీ పాన్ కార్డ్ ఆ అడ్రెస్‌కు రావచ్చు.

స్టెప్ 3:

--> ఇప్పుడు మీరు ఫిల్ చేసిన అడ్రెస్‌ను ధృవీకరించాలి.

--> దీని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ IDకి OTP వస్తుంది.

--> మీరు ఈ OTPని ఇక్కడ ఫిల్ చేయాలి.

--> ఆ తర్వాత ఆన్‌లైన్‌లో రూ.50 ఫీజు చెల్లించాలి.

--> చెల్లింపు తర్వాత సబ్మిట్‌ బటన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 4:

--> చెల్లింపు పూర్తయిన వెంటనే మీరు పాన్ కార్డ్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

--> అక్కడ మీకు స్లిప్ వస్తుంది.దానిని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి.

--> దీని తర్వాత కొన్ని రోజుల్లో మీ పాన్ కార్డు మీరు ఇచ్చిన అడ్రెస్‌కు చేరుకుంటుంది.

Also Read: క్రికెటర్లపై బీజేపీ కన్ను.. యువరాజ్‌ సింగ్‌ ట్వీట్ వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు