ఏ మాత్రం సిగ్గున్నా సీఎం పదవికి రాజీనామా చేయాలి.... సీఎం గెహ్లాట్ పై అమిత్ షా ఫైర్....!

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రెడ్ డైరీ విషయంలో సీఎం పదవికి ఆశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలన్నారు. రెడ్ డైరీని చూసి గెహ్లాట్ భయపడుతున్నారని ఆయన అన్నారు. అసలు రెడ్ డైరీ గురించి సీఎం అశోక్ గెహ్లాట్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని పేర్కొన్నారు.

author-image
By G Ramu
New Update

రాజస్థాన్ లోని గంగాపూర్ లో ఇఫ్కో ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సహకార్ కిసాన్ సమ్మేళన్’ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..... గెహ్లాట్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి, నల్ల పనుల వివరాలు రెడ్ డైరీలో వున్నాయని షా అన్నారు. తనకు ఒకరు ఒక ఫోల్డర్ పంపించారని వెల్లడించారు.

ఆ ఫోల్డర్ ను ఉంచకూడదని చెప్పానన్నారు. ఆ ఫోల్డర్ కలర్(డెయిరీ) చూసి అశోక్ గెహ్లాట్ ఆగ్రహం చెందుతారన్నానన్నారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు సభలో నినాదాలు చేశారు. దీనిపై అమిత్ షా ఫైర్ అయ్యారు. కొందర్ని పంపి నిరసనలు తెలిపినంతా మాత్రాన ఏమీ జరగదన్నారు. గెహ్లాట్ కు ఏ మాత్రం సిగ్గు వున్నా రెడ్ డైరీ విషయంలో రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజస్థాన్ కు ఆ పార్టీ ఏమీ చేయలేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని రైతుల కోసం కాంగ్రెస్ ఎలాంటి పథకాలు తీసుకు రాలేదని తీవ్రంగా మండిపడ్డారు.. బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కార్ వచ్చాక వ్యవసాయ బడ్జెట్ ను పెంచిందన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బడ్జెట్ ను రూ. 22000 కోట్లకు పెంచామన్నారు.

ఈ ఏడాది జూలై కాంగ్రెస్ సర్కార్ పై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజేందర్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ మేరకు గెహ్లాట్ సర్కార్ వైఫల్యాలు, అవినీతి సంబంధించి అంశాలతో ఓ డైరీ రాసినట్టు చెప్పారు. దానికి రెడ్ డైరీ అని పేరు పెట్టినట్టు చెప్పారు. త్వరలోనే దాన్ని ప్రజల ముందుకు తీసుకు వస్తానన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు