Katchatheevu : అలా చేస్తే కచ్చతీవు ఇచ్చేస్తాం.. భారత్‌కు శ్రీలంక షరతు

కచ్చతీవు ద్వీపాన్ని భారత్‌కు అప్పగించే ఉద్దేశం తమకు లేదని.. శ్రీలంక మత్స్యశాఖ మంత్రి దేవానంద స్పష్టం చేశారు. కన్యాకుమారికి సమీపంలో ఉన్న వాడ్జ్‌ బ్యాంక్ ప్రాంతాన్ని తమకు అప్పగిస్తే.. కచ్చతీవును ఇస్తామని తేల్చిచెప్పారు

Katchatheevu : అలా చేస్తే కచ్చతీవు ఇచ్చేస్తాం.. భారత్‌కు శ్రీలంక షరతు
New Update

PM Modi : దేశంలో లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) జరగనున్న వేళ.. కచ్చతీవు(Katchatheevu) వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi).. తమళనాడు(Tamilnadu) లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కచ్చతీవును అంశాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ దీవిని 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వమే శ్రీలంకకు ఇచ్చిందంటూ విమర్శలు చేశారు. వీటిపై స్పందించిన శ్రీలంక కూడా కచ్చతీవును భారత్‌ తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్లకు ఆధారాలు లేవని తెలిపింది.

అలా చేస్తే కచ్చతీవు ఇస్తాం

అయితే తాజాగా మరోసారి శ్రీలంక(Srilanka) కచ్చతీవు వివాదంపై స్పందించింది. కచ్చతీవు ద్వీపాన్ని భారత్‌కు అప్పగించే ఉద్దేశం తమకు లేదని.. శ్రీలంక మత్స్యశాఖ మంత్రి డగ్లస్ దేవానంద అన్నారు. కన్యాకుమారికి సమీపంలో ఉన్న వాడ్జ్‌ బ్యాంక్ ప్రాంతాన్ని తమకు అప్పగిస్తే.. కచ్చతీవును ఇస్తామని తేల్చిచెప్పారు. వాడ్జ్‌ బ్యాంక్ ప్రాంతాన్ని అప్పగిస్తేనే.. కచ్చతీవును తిరిగిస్తామని పేర్కొన్నారు. వాడ్జ్‌ బ్యాంక్‌ ప్రాంతంలో విలువైన వనరులు ఉండటం వల్లే అప్పట్లో భారత్ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు చేశారు.

Also Read: యూపీఐ ద్వారా బ్యాంకుల్లో క్యాష్‌ డిపాజిట్‌ చేసే సదుపాయం : ఆర్బీఐ

మీరు ఎందుకు అలా చేశారు? 

ఇదిలాఉండగా.. ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం.. 1974లో భారత ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ.. అప్పటికే భారత భూభాగంలో ఉన్న కచ్చతీవును శ్రీలంకకు అప్పగించినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ.. ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ కూడా స్పందించింది. బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఒప్పందం సందర్భంగా.. 111 భారత ప్రాంతాలను బంగ్లాదేశ్‌కు ఎందుకిచ్చారంటూ మోదీ సర్కార్‌ను ప్రశ్నిస్తోంది.

అయితే 1974 లో జరిగిన భారత్-శ్రీలంక ఒప్పందం ప్రకారం ఇరు దేశాలకు చెందిన మత్స్యకారులు ఈ కచ్చతీవు దీవి ప్రాంతంలో చేపలు పట్టుకోనే అనుమతి ఉండేదని.. కానీ ఆ ఒప్పందాన్ని 1976లో సవరించినట్లు శ్రీలంక మంత్రి దేవానంద అన్నారు. ఈ సవరణ ప్రకారం.. భారత్‌-శ్రీలంక దేశాలకు చెందిన మత్స్యకారులు పొరుగు జలాల్లో చేపలు పట్టుకోవడాన్ని నిషేధం విధించినట్లు తెలిపారు. ఈ సవరణ ఒప్పందంలో భాగంగానే సముద్రంలో సరిహద్దులు విభజించినట్లు తెలిపారు. కన్యాకుమారికి దిగువన వాడ్జ్‌బ్యాంక్‌ అనే ఓ ప్రాంతం ఉందని.. అక్కడ ఎన్నో వనరులున్నాయని చెప్పారు. కచ్చతీవు దీవుల కంటే ఆ ప్రాంతం 80 రేట్లు పెద్దదని.. 1976 ఒప్పందం ప్రకారం అది భారత్‌కు దక్కినట్లు వెల్లడించారు.

Also Read: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. కొలువుల భర్తీ అప్పుడే

#katchatheevu #telugu-news #srilanka #pm-narendra-modi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి