/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/W2B-jpg.webp)
ప్రస్తుత కాలంలో వయసుతో సంభందం లేకుండా చిన్న పిల్లలకు, టీనేజీ కురాళ్లకు వెంట్రుకలు తెల్లగా కావడం కామన్ అయింది. అయితే కొన్ని ఆహార పదార్థాలను మన రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఈ తెల్ల జుట్టు సమస్యను తగ్గించవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ఆ ఆహారాలు ఏంటో ఒక లుక్ వెయ్యండి.
ALSO READ: బుల్డోజర్లతో వెళ్లి నామినేషన్ వేసిన తెలంగాణ బీజేపీ నేత!
తెల్ల శనగలు:
తెల్ల శనగల్లో విటమిన్ బి9 పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా 400 మైక్రోగ్రాములు కూడా లభిస్తాయి. కాబట్టి వీటినితో తయారు చేసిన ఆహారాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అంతేకాకుండా తెల్ల జుట్టు రాకుండా ఉంటుందట.
చికెన్:
ఏంటి చికెన్ తింటే వెంట్రుకలు తెల్లగా అవ్వవా? అంటే అవునని అంటున్నారు వైద్య నిపుణులు. చికెన్‌లో విటమిన్ బి12 అధిక పరిమాణంలో ఉంటుందట.. అందుకే దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా చిన్న వయసులో తెల్ల జుట్టు రాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ALSO READ: రేవంత్ రెడ్డిని ఓడిస్తే నరేందర్ రెడ్డికి ప్రమోషన్.. కేటీఆర్ సంచలన ప్రకటన!
పప్పు ధాన్యాలు:
శరీర అభివృద్ధికి పప్పు ధాన్యాలు కీలక పాత్ర పోషిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఇందులో విటమిన్ B12తో పాటు DNA, RNA ఉత్పత్తిని చేసే చాలా రకాల మూలకాలు లభిస్తాయి. అంతేకాకుండా పప్పులు ధాన్యాల్లో అమైనో యాసిడ్ కూడా లభిస్తాయి. కాబట్టి శరీరంలో మెథియోనిన్ ఉత్పత్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుందట.
ప్రోటీన్స్ గల ఆహారాలు:
మనిషి శరీరానికి ప్రోటీన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ప్రోటీన్స్ గల ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా తెల్ల జుట్టు రాకుండా జుట్టుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. RTV దానిని ధృవీకరించలేదు.