Health Tips: ఈ కూరగాయలను ఉడికించకుండా తింటే.. ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు..!!

మనలో చాలా మందికి పచ్చికూరగాయలు తినే అలవాటు ఉంటుంది. కొన్ని పచ్చిగా తింటే..మరికొన్ని ఉడికించి తింటుంటాము. అయితే పచ్చికూరగాయలు తినడం వల్ల లాభాలే కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని కూరగాయలను పచ్చిగా అసలు తినకూడదని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

Health Tips : నిత్యం వీటిని తీసుకుంటే చాలు..2 లీటర్ల కంటే ఎక్కువ రక్తం పడుతుంది..!!
New Update

మనం ఆరోగ్యంగా ఉండాలన్నా...వ్యాధులకు దూరంగా ఉండాలన్నా...కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ శరీరం కూరగాయల నుంచి పుష్కలమైణ పోషకాలను పొందుతుంది. అవసరమైన విటమిన్లు, ప్రొటిన్లు, ఖనిజాలతోపాటు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు వాటిలో కనిపిస్తాయి. కూరగాయలతోపాటు ఆకుకూరలు తినడం కూడా చాలా మంచిది. ఎందుకంటే వీటిని తింటే శరీరంలోని అనేక వ్యాధులు నయం అవుతాయి. అయితే చాలా మంది కొన్ని కూరగాయలను పచ్చిగా తింటే..మరికొన్నింటిని ఉడికించి తింటాము. ఎలాంటి కూరగాయలు పచ్చిగా తినకూడదో ఇప్పుడు చూద్దాం.

బెండకాయ:
బెండకాయను వండుకుని తినడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు. కానీ పచ్చిగా తింటే అనారోగ్యానికి గురవ్వక తప్పదు. మీరు పచ్చిగా తింటున్నట్లయితే ఈరోజే మానుకోండి. ఎందుకంటే పచ్చి బెండకాయ మీ ఆరోగ్యానికి హాని కలిగించడంతోపాటు అందులో ఉండే ఆల్కలాయిడ్ సమ్మేళనం పోలనిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదట. దీని వల్ల కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి.

ఇది కూడా చదవండి: శుక్రవారం రాత్రి ఈ పని చేస్తే…ఐశ్వర్యానికి అధిపతి మీరే..!!

మష్రూమ్:
పలు వంటకాల్లో మరింత రుచి కోసం పుట్టగొడులను వాడుతుంటారు. కొంతమంది దీనిని పచ్చిగా తింటుంటారు. మీరు పుట్టగొడుగులను పచ్చిగా తింటే జాగ్రత్త. ఎందుకంటే హానికరమైన బ్యాక్టీరియా పుట్టుగుల్లో ఉంటుంది. ఇది మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది.

ఇది కూడా చదవండి: నేడు సిల్క్ స్మిత వర్ధంతి.. ఆమె ఎలా మరణించారో తెలుసా..?

బ్రస్సెల్స్ మొలకలు:
బ్రస్సెల్స్ మొలకలను పచ్చిగా తినకూడదు. ఎందుకంటే దీన్ని పచ్చిగా తింటే ఆరోగ్యం పాడై జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

బచ్చలికూర:
బచ్చలికూరను పచ్చిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. పచ్చిగా తినడం కంటే వండి తింటే చాలా ప్రయోజనాలను పొందవచ్చట.

బంగాళ దుంప:
బంగాళదుంప ఉడికించి తినడం మంచిది. పచ్చిగా తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

ఇది కూడా చదవండి: మీ టూత్ బ్రష్‌ను బాత్రూంలో వదిలేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?

(Disclaimer:ఈ కథనం ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగానే ఇవ్వబడింది. ఆర్టీవీ(RTV) దీన్ని ధృవీకరించలేదు, బాధ్యత వహించదు. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం)

#life-style #food #vegetables-in-raw
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe