Eat Quinoa Rice : అన్నం బదులు ఇవి తింటే వందేళ్లు ఆరోగ్యం

క్వినోవా ధాన్యాలతో అన్నంతో పాటు పోహా, ఉప్మా, సలాడ్లు, సూప్‌లు, స్మూతీ..ఇలా చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్వినోవాను తినడం వల్ల షుగర్‌ లెవల్స్‌తో పాటు కొలెస్ట్రాల్‌ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

New Update
Eat Quinoa Rice : అన్నం బదులు ఇవి తింటే వందేళ్లు ఆరోగ్యం

Eat Quinoa Rice Benefits: ప్రస్తుత కాలంలో అందరూ ఆరోగ్యంపై దృష్టిపెట్టారు. ముఖ్యంగా తిండి విషయంలో కేర్‌ తీసుకుంటున్నారు. తెల్ల బియ్యంతో చేసిన అన్నం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతుండటంతో అన్నం తినడం తగ్గించి ఇతర ప్రత్యామ్నాయాలవైపు దృష్టిపెట్టారు. చిరుధాన్యాలు, చపాతీలు వంటివి తింటున్నారు. అన్నానికి ప్రత్యామ్నాయంగా ఎక్కువశాతం మంది క్వినోవాలాంటి చిరుధాన్యాలను తింటున్నారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
ఇది కూడా చదవండి: ఈ ప్యాక్‌తో అవాంఛిత రోమాలు మాయం
క్వినోవా ఎక్కువగా సూపర్‌మార్కెట్లలో అలాగే ఆన్‌లైన్‌లో కూడా లభిస్తోంది. క్వినోవా ధాన్యాలతో అన్నంతో పాటు పోహా, ఉప్మా, సలాడ్లు, సూప్‌లు, స్మూతీ..ఇలా చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు. వీటిని మ‌ద‌ర్ ఆఫ్ ఆల్ గ్రెయిన్స్ అంటారు. ఎలా తీసుకున్నా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు. క్వినోవాను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం. వీటిని తినడంతో కొందరగా బరువు తగ్గొచ్చు. అంతేకాకుండా ఈ క్వినోవా అరగడానికి చాలా సమయం తీసుకుంటుంది. దీంతో మనకు కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఎక్కువ సమయం వరకు ఆకలి కూడా కాదు. అందుకే బరువు తగ్గించుకోవాలి అనుకునేవారికి ఇది బెస్ట్‌ అంటున్నారు.
డిప్రెషన్‌, ఆందోళనను దూరం
ఈ క్వినోవాను తినడం వల్ల రక్తంలో షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి. మధుమేహం ఉన్నవారు క్వినోవాను తింటే షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయని అంటున్నారు. అంతేకాకుండా మన శరీరంలోని కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ కూడా అదుపులో ఉంటాయి. గుండె సంబంధింత సమస్యలు కూడా రావు. అలాగే నిద్రలేమి సమస్యను ఈ క్వినోవా తగ్గిస్తుంది. డిప్రెషన్‌, ఆందోళనను దూరం చేస్తుంది. నిత్యం క్వినోవా తింటే శరీరం కూడా బలంగా తయారవుతుంది. కండరాలు గట్టిపడతాయి. ఎముక‌లు ధృఢంగా మారుతాయి. రక్త హీనత సమస్య ఉన్నవారికి ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు. క్వినోవా జీర్ణక్రియను మెరుగుచేసి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు