Red Capsicum Benefits: రెడ్ క్యాప్సికంతో అధిక బరువు తగ్గొచ్చా.. ఇలా చేస్తే ఎంతో ఉపయోగం

క్యాప్సికంను ఎక్కువగా సలాడ్ వంటి వంటకాలలో వాడతారు. రెడ్ క్యాప్సికంలో విటమిన్-ఏ, బీటా కెరోటిన్ వంటి పోషకాలు ఎక్కువ ఉన్నాయి. వీటిని తింటే కంటిచూపు మెరుగుపడి, కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా చేస్తుంది.

New Update
Red Capsicum Benefits: రెడ్ క్యాప్సికంతో అధిక బరువు తగ్గొచ్చా.. ఇలా చేస్తే ఎంతో ఉపయోగం

Red Capsicum Benefits: ప్రకృతిలో మనకు లభించే కూరగాయలు తినటం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాప్సికం అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఈ క్యాప్సికంను ఎక్కువగా సలాడ్ వంటి వంటకాలలో వాడతారు. దీనితోపాటు రకరకాల వంటల్లో కూడా ఈ రెడ్ క్యాప్సికంను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే.. క్యాప్సికంతో చేసే వంటలు చాలా రుచిగా  ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా సులభంగా ఉంటుంది. ఈ రెడ్ క్యాప్సికంను రోజూ తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వివిధ రకాల ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవచ్చు. అసలు ఎరుపు రంగులో ఉండే క్యాప్సికంను ఎందుకు ఆహారంలో తీసుకోవాలి. ఇది తింటే మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం.

ఎరుపు రంగు క్యాప్సికంలో పోషకాలు పుష్కలం 

సాధారణంగా మనకు ఆకుపచ్చ, పసుపు, ఎరుపు ఈ రంగుల్లో క్యాప్సికం మార్కెట్లో కనబడుతూ ఉంటాయి. అయితే.. ఎన్ని రంగుల క్యాప్సికాలు ఉన్నప్పటికీ ఎక్కువగా ఆకుపచ్చ రంగు క్యాప్సికంను వాడుతూ ఉంటారు. ఏ వంట చేసినా కానీ దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే.. ఆకుపచ్చ రంగు క్యాప్సికం కాకుండా ఎరుపు రంగులో ఉండే క్యాప్సికంను తింటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు పోషకాలు దాగి ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఎరుపు రంగు క్యాప్సికంలో విటమిన్- ఏ బీటా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తింటే కంటిచూపు మెరుగుపడి, కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారు ఎరుపు రంగు క్యాప్సికం తింటే చక్కటి ఫలితం మీ సొంతం అవుతుంది.

ఇది కూడా చదవండి: మహిళలకు కాలి చూపుడు వేలు పెద్దగా ఉంటే ఏమవుతుంది?

అలాగే.. ఈ రెడ్ క్యాప్సికం శరీరంలో జీర్ణక్రియల రేటును పెంచి ఎక్కువ క్యాలరీలు కర్చయేలా చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఎరుపు రంగు క్యాప్సికంను తింటే గుండె ఆరోగ్యం మంగాచి ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. దీనిలో ఎక్కువగా ఐరన్ రక్తహీనతను తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఉంటే ఈ క్యాప్సికం తింటే తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రెడ్‌ క్యాప్సికం కాపాడుతుంది. ఇలాంటి సమస్యలను తప్పించుకొని ఆరోగ్యం ప్రయోజ‌నాల‌న్నింటిని పొందాలంటే మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా రెడ్ క్యాప్సికంను తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు