Health Care: ఆకు కూరలలో అనేక ఔషధ గుణాలున్నాయి. పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో పొన్నగంటి కూరగా పేరు ఉంది. కంటిచూపుకు ఎంతో మంచిదని నమ్మేవారు. కంటిచూపు కొల్పోయిన వాళ్లు ఈ కూర తింటే చూపు తిరిగి వస్తుందనే నమ్మకంతో దీనిని ఆహారంగా తీనేవాళ్లు. భారతదేశంలో పొన్నగంటి కూరను ఒక అద్భుత మొక్కగా పిలుస్తారు. ఆకు కూరలలో అనేక ఔషధ గుణాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఔషధ గుణాలు కలిగిన ఆకు కూరలో ఒకటి పొన్నగంటి కూర. పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో కంటిచూపుకు ఎంతో మంచిదని నమ్మేవారు. అయితే కాదు.. కంటిచూపు కొల్పోయిన వాళ్లు ఈ కూర తింటే చూపు తిరిగి వస్తుందనే నమ్మకంతో దీనిని ఆహారంగా తీనేవాళ్లు. దీంతో ఈ ఆకు కూరకు ‘పోయిన కంటి కూర’ అని పొన్నగంటి కూరగా పేరు వచ్చింది. దీనికి విత్తనాలు ఉండవు.. కేవలం కాండం ద్వారా ఇది పేరుతుతుంది. పొన్నగంటి కూర ఆకులు ఏడాది పొడవునా దొరుకుతాయి. బాగా తేమ, వేడి వాతావరణంలో పొన్నగంటి మొక్కలు ఎక్కువగా పెరుగుతుంది. అలాగే దీనిలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు పొన్నగంటి కూర ఆకులతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పొన్నగంటి కూర తినటం వలన కలిగే ప్రయోజనాలు
- పొన్నగంటి కూరలో జుట్టుకు పోషణనను సమృద్ధిగా పెంచుతుంది.
- ఈ ఆకులు కళ్ళను పోషించడం, చర్మం సహజమైన సౌందర్యానికి మేలు చేస్తుంది.
ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి త్రాగోచ్చు. - పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు రక్తపోటు, గుండె సమస్యలను తగ్గిస్తుంది.
- బరువు తగ్గాలనుకునే వారు పొన్నగంటి ఆకు కూరను ప్రతీరోజూ తింటే మంచిది. దీనిని తరచూ తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
పొన్నగంటి కూరలో విటమిన్ ఎ, సి, రైబో ఫ్లేవిన్, మెగ్నిషియం, ఐరన్, జింక్, పొటాషియం లతోపాటు ప్రోటీన్స్ కూడా అధికంగా ఉంటాయి.
ఈ ఆకుల్లో ఉండే కొన్ని పోషకాలు క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. - పొన్నగంటి కూరను 48 రోజులపాటు తింటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: అత్తమామలతో బంధం స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.