ఓటు వేయకపోతే శిక్షలు పడతాయి...ఎక్కడో తెలుసా?

భారతదేశంలో కొన్ని రోజులుగా ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఇవాళ తెలంగాణలో పోలింగ్ జరుగుతోంది. ఓటు వేయడం చాలా ఇంపార్టెంట్ అని తెలుసు కానీ చాలా దేశాల్లో ఓటు వేయకపోతే నేరం కింద పరిగణిస్తారని మీకు తెలుసా?

ఓటు వేయకపోతే శిక్షలు పడతాయి...ఎక్కడో తెలుసా?
New Update

మన దేశంలో ఓటు హక్కు వినియోగించుకున్నా లేకపోయినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం ఓటు వేయకపోతే చాలా పెద్ద నేరం. దీన్ని నేరం కింద కూడా పరిగణిస్తారు. ఆస్ట్రేలియాలో పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందే. అలా చేయకపోతే శిక్ష కచ్చితంగా అమలు చేస్తారు. ఆస్ట్రేలియాలో ఓటు వేయకపోతే ఆ దేశ కరెన్సీ ప్రకారం 20 డాలర్ల జరిమానా విధిస్తారు. అది కూడా వాళ్ళు ఇచ్చిన గడువు లోపు కట్టేయాలి. లేకపోతే ఆ జరిమానా కాస్తా పెరిగిన 200 డాలర్లు కట్టాల్సి ఉంటుంది.

Also read:పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.75 లక్షల ఓట్లు నమోదు

ఇక బెల్జియంలో అయితే మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోని వారికి 80 యూరోల వరకు, రెండోసారి ఓటు వేయనివారికి 200 యూరోల వరకు జరిమానా విధిస్తారు. ఆ తరువాత మధ్యలో ఒకటి, రెండు సార్లు మిస్ అయినా పర్వాలేదు కానీ అదే వరుసగా నాలుగుసార్లు వినియోగించుకోకపోతే మాత్రం పదేళ్ల వరకు జాబితా నుంచి పేర్లను తొలగిస్తారు. దీనికితోడు ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ పథకాల్లోనూ ప్రాధాన్యం ఇవ్వరు. దీంతో పాటూ బ్రెజిల్‌లోనూ ఓటు వేయనివారు ఫైన్‌ కట్టాలి.

గ్రీసు, ఈజిప్టు దేశాల్లో ఓటు వేయనివారిపై ప్రత్యేక విచారణ చేస్తారు. సరైన కారణం చెబితే సరే లేకపోతే శిక్ష తప్పదు. ఎలాంటి కారణం లేకుండా ఓటు వేయలేదని తేలితే జైలుశిక్ష విధిస్తారు. ఇటలీలో ఓటు వేయనివారి పేర్లను అందరికీ తెలిసేలా అధికారిక పత్రాల్లో ప్రచురిస్తారు. పెరూలో ఓటుకు దూరంగా ఉన్నవారి డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దు చేస్తారు.

ఇవన్నీ పక్కన పెడితే మనదేశంలో మనకు ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ . అది మనకు వరం. ఓటు వేసినా, వేయకపోయినా ఎవరూ అడగరు. కానీ ఓటు వజ్రాయుధం. మన హక్కు. మన పాలకులను మనమే నిర్ణయించుకునే మన అధికారం. దాన్ని వేస్ట్ చేసుకుంటే నష్టపోయేది మనమే. కాబట్టి ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.

#polling #register #punishment #votes #countries
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి