/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-54-1-jpg.webp)
AP : ఎల్లప్పుడూ సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలిచే కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ramgopal varma)కే షాక్ ఇచ్చాడు ఏపీకి చెందిన పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ (kolikapudi srinivas). ఏకంగా రామ్ గోపాల్ వర్మ తలకే ఎసరు పెట్టిన ఆయన.. ఆర్జీవీ హెడ్ (head) తెస్తే కోటీ రూపాయలు ఇస్తానంటూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతుండగా దీనిపై రామ్ గోపాల్ వర్మ సైతం ఘాటుగానే రిప్లై ఇచ్చారు. కాగా వీరిద్దరి వాదోపవాదాలకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.
నివారిస్తున్నట్టు నటిస్తూనే ఆ కొలికపూడి శ్రీనివాసరావు తో నన్ను చంపించటానికి మూడు సార్లు కాంట్రక్ట్ ఇప్పించావుగా సాంబా ..జస్ట్ వెయిట్ pic.twitter.com/3eMyfRGcM1
— Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2023
ఈ మేరకు మంగళవారం 'ఆర్జీవీ పరాన్నజీవి' పేరుతో TV-5 ఛానల్‌లో ఓ చర్చా కార్యక్రమం నిర్వహించగా ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కొలికపూడి శ్రీనివాస్. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ రామ్ గోపాల్ వర్మను చర్చలోకి లాగిన శ్రీనివాస్.. 'రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటీ రూపాయలు ఇస్తా' అంటూ సవాల్ చేశారు. వెంటనే షోలో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చట్ట ప్రకారమే మాట్లాడలని కోరారు. అలాగే శ్రీనివాస్ వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని రిక్వెస్ చేసినా వినకుండా మొండిగా వాధించిన శ్రీనివాస్ 'ఐ రిపీట్.. ఐ రిపీట్.. నాకు సమాజం కంటే ఏదీ ఎక్కువ కాదు' అంటూ రెచ్చిపోయారు.
Am reaching the office of DIRECTOR GENERAL of POLICE in VIJAYWADA by 3.30 pm TODAY to file a complaint against Kolikapudi Sreenivas Rao, Tv 5 anchor Sambashiva Rao and the channel owner B R Naidu ..Will disclose the contents of my complaint to all media immediately after that pic.twitter.com/GjfyX5Uz7h
— Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2023
ఇది కూడా చదవండి : WFI : రెజ్లర్లను కలిసిన రాహుల్ గాంధీ.. ఆ విషయంపైనే చర్చించారన్న పునియా
అయితే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తనదైన స్టైల్ లో రియాక్ట్ అయిన రామ్ గోపాల్ వర్మ.. 'నివారిస్తున్నట్టు నటిస్తూనే ఆ కొలికపూడి శ్రీనివాసరావుతో నన్ను చంపించటానికి మూడు సార్లు కాంట్రక్ట్ ఇప్పించావుగా సాంబా' అంటూ శ్రీనివాస్ పోస్టును రిపోస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా.. జస్ట్ వెయిట్ జగన్ రంగంలోకి దిగాల్సిందే అన్నారు. అలాగే మరో ట్వీట్‌లో చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్‌లను ట్యాగ్ చేసిన రామ్‌గోపాల్ వర్మ.. హింస, గూండాయిజం, ఉగ్రవాదులంటూ ఇతర పార్టీలను మీరు విమర్శించడం జోక్ అంటూ సెటైర్లు వేశారు. అంతటితో ఆగకుండా మరో ట్వీట్‌లో కొలికపూడి వ్యాఖ్యలపై ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొలికపూడి శ్రీనివాస రావు తనను చంపించడానికి కోటి రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చాడని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే టీవీ-5 యాంకర్ సాంబ సైతం చాలా తెలివిగా.. తన హత్యకు సంబంధించి కొలికపూడి చేసిన వ్యాఖ్యలను 3 సార్లు పునరావృతం చేసేలా వ్యవహరించాడన్నారు. ఇదే అధికారిక ఫిర్యాదుగా స్వీకరించాలని ఏపీ పోలీసులను కోరారు.