Health : మీరు 30 ప్లస్ అయితే ఖచ్చితంగా మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి!

ముప్పై దాటిన తరువాత మనకున్న భాద్యతలతో మనపై మనం సరయిన శ్రద్ద తీసుకోము. అలాంటప్పుడు వయసు మీదపడుతున్నకొద్దీ అనేక ఆరోగ్య సమస్యలు తెలేత్తుతాయి. ముఖ్యంగా శారీరక ధారుడ్యం సన్నగిల్లుతుంది. అందుకోసం ముప్పై దాటిన వాళ్ళు మీ ఆహారంలో పోశకాలు ఉండేలా చూసుకోవాలి.

Health : మీరు 30 ప్లస్ అయితే ఖచ్చితంగా మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి!
New Update

Healthy Foods : మనిషి జీవన శైలి(Human Life Style) పూర్తిగా మారిపోయింది. చిన్న వయసులోనే కొత్త జబ్బులు సంక్రమిస్తున్నాయి. ఇవన్నీ మనం తినీ ఆహారంపై ఆధారపది ఉనతాయని అందరికి తెలిసిందే.అయినా సరే.. మనం తీసుకునే ఆహారం(Food) పై శ్రద్ద వహించం. జంక్ ఫుడ్స్ , మసాల ఫుడ్స్ వైపే మొగ్గు చూపుతాం. ఒకప్పుడు 60 ఏళ్లు దాటినా కూడా మామూలు ఆహరం తీసుకున్న సరిపోయేది. కాని ఇప్పుడలా కాదు. 3O ఏళ్ళు దాటాయంటే ముప్పు తప్పదు. అందుకే ప్రతీ ఒక్కరూ  30 తర్వాత, ఖచ్చితంగా మీ ఆహారపు అలవాట్లలో కొన్ని ఆహర పదార్ధాలను చేర్చుకోవాలి.

30 ప్లస్ లో ఇలా చేయండి 

30 తర్వాత చాలా మందిలో శారీరక ధారుడ్యం(Body Fitness) తగ్గిపోతుంది.  శరీరం ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలంటే ఆహారం విషయంలో ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. 30 సంవత్సరాల వయస్సులో, ఒక వ్యక్తి అనేక రకాల బాధ్యతలతో ఉండటం వల్ల  తన ఆహారంపై శ్రద్ధ చూపలేడు. కానీ.. ఖచ్చితంగా మీ డైట్ లో ఈ పదార్ధాలు చేర్చుకుంటే శారీరక ధారుడ్యం పెర్గుతుంది.

బ్రోకలీ

publive-image

ముప్పై తరువాత శరీరంలో అనేక రకాల మార్పులు కనిపిస్తాయి. రెగ్యులర్ గా చేసే పనులు సైతం మనలో శక్తి లేకపోతే నీరసం ఆవహిస్తుంది. మనకు తెలియక నీరసానికి టానిక్స్ వాడుతాం. కానీ.. ముందుగా గుర్తించి సరయిన పౌష్టికాహారం తీసుకుంటే మంచిది. ఈ విషయంలో మీరు రోజూ మీ ఆహారంలో బ్రోకలీ(Broccoli) ని చేర్చుకోవాలి. దీనిలో ఉన్న పోషకాలు శక్తినిస్తాయి.

గింజలు (నట్స్)

publive-image

ఉదయాన్నే నానబెట్టిన పప్పు ధాన్యాలు ( గింజలు )  ప్రతి రోజు ఉదయాన్నే తినడం వల్ల  మీ శరీరం చాలా దృఢంగా మారుతుంది. నట్స్‌లో అధిక ప్రొటీన్లు ఉంటాయి.

స్వచ్చమైన తేనే

publive-image

తేనె(Honey) వల్ల మన శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో అందరికి తెలుసు. అందుకోసమే తప్పని సరిగా తేనె తీసుకోవాలి.  అనేక ప్రధాన వ్యాధుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడానికి మీరు దీన్ని తినాలి. యాంటీసెప్టిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు తేనెలో పుష్కలంగా ఉన్నాయి.

చియా విత్తనాలు

publive-image

ఒమేగా-3(Omega- 3) ఫ్యాటీ యాసిడ్స్ మరియు మెగ్నీషియం ఇందులో పుష్కలంగా ఉండే చియా సీడ్స్(Chia Seeds) ను తప్పనిసరిగా మీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి శరీరానికి బలాన్నివడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

.వెల్లుల్లి

publive-image

ఇక మీ ఆహారంలో ముఖ్యంగా చేర్చుకోవాల్సిన పదార్ధం వెల్లుల్లి. దీని గురించి చెప్పాలంటే.. మీ శరీరం నుండి వ్యాధులను దూరంగా ఉంచుతూ మనకు రక్షణ కవచం లా ఉంటుంది.,ఇది చాలా ప్రత్యేకమైనది. వెల్లుల్లి శరీరంలోని బ్యాక్టీరియాను చంపుతుంది.

ఇవండీ.. మనకి తెలియకుండానే మన శారీరక ధారుడ్యం తగ్గిపోతూ ఉండటం.. ఆ తరువాత మందులు.. మాకు అంటూ వైద్యుల దగ్గరికి పరిగెత్తడం చేసేబదులు.. ముందుగానే పౌష్టికాహారం తీసుకుంటే మంచిది.

ALSO READ : మార్కెట్ లో లభించే టమాటో సాస్ వాడుతున్నారా ? ఇక .. మీ పని అంతే !!

#best-health-tips #healthy-foods #30plus-diet-foods #human-life-style
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe