forehead blob: ఇలా మీ నుదుటిన బొట్టు పెట్టుకుంటే అందంగా ఉంటారు

హిందువులు లేదా సనాతన ధర్మాన్ని పాటించేవారు నుదిటి మీద బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకున్న వారి ముఖం చక్కని కళతో ఉంటుంది. బొట్టు లేని ముఖాన్ని చూడకూడదని సాంప్రదాయాలు అచరించే వారు చెబుతుంటారు. బొట్టుని ఈ చిట్కాలు పాటించి పెట్టుకుంటే ఫేస్‌కి మంచిగా స్టేట్‌ అవుతుంది.

forehead blob: ఇలా మీ నుదుటిన బొట్టు పెట్టుకుంటే అందంగా ఉంటారు
New Update

beauty tips: మన దేహంలోని ప్రతీ శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారు. ఇక నుదుటికి అధిదేవత బ్రహ్మదేవుడని చెబుతారు. బ్రహ్మ స్థానమైన నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. బొట్టులేని ముఖం, ముగ్గులేని ఇల్లు స్మశానంతో సమానం అంటారు పెద్దలు. అందుకే స్త్రీలు ఎప్పుడు బొట్టు పెట్టుకోవటం తప్పనిసరి. మంచి లుక్‌తో అమ్మాయిలను అందంగా కనిపించేలా చేయడంలో బొట్టు ఒకటి. మార్కెట్‌లో ఇప్పటికే ఎన్నో రకాల, రంగుల బిందీలు ఉన్నాయి. కొంతమంది స్టైల్ బిందీలను పెట్టుకుంటే.. ఇంకొందరు చమ్కీ, పొడుగ్గా బిందీలను పెట్టుకుంటారు. అయితే.. చాలామంది వారి ఫేస్‌కి సూట్ కాని స్టిక్కర్స్‌ని పెట్టటం వలన ముఖం అంత ఎట్రాక్టీవ్‌గా ఉండదు. ఈ బొట్టు, బిందీలను పెట్టుకునే విషయంలో కొన్ని టిప్స్ పాటింస్తే ఒక్కొక్కరి ఫేస్‌కి ఒక్కో స్టైల్‌ బిందీలు సూట్ అవుతాయి. మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం.

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే అందంగా...

  • చాలామంది రౌండ్, డైమండ్, ఓవల్, హార్ట్ ఫేస్ ఉన్నవారు ఉంటారు. అయితే.. ఈ రౌండ్ ఫేస్ ఉన్నవారి ముఖం గుండ్రంగా ఉంటుంది. పొడుగ్గా ఉండే స్టిక్కర్స్‌ని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. దీనివల్ల మీ లుక్ సూపర్‌గా ఉంటుంది. చూడటానికి చాలా అందంగా ఉంటారు.
  • హార్ట్ షేప్ ఉన్నవారుకి నుదురు, గడ్డం చదునుగా ఉంటుంది కాబట్టి గుండ్రంగా, కొంచెం పొడుగ్గా ఉన్న బొట్టు పెట్టుకుంటే ఆకర్షణీయంగా ఉంటారు. ఇలా బొట్టు విషయంలో ఈ చిన్న చిట్కాలు పాటిస్తే అందరూ అందంగా కనిపిస్తారు.
  • డైమండ్ షేప్ ఉన్నవారు డిజైన్స్ ఉండే వాటి కంటే సింపుల్‌గా ఉండే స్టిక్కర్స్ పెట్టుకుంటే అందంగా ఉంటారు.
  •  ఓవల్ షేప్ ఉన్నవారికి నుదురు, గడ్డం అనేది పొడుగ్గా ఉంటాయి. వీరు గుండ్రంగా ఉండే బొట్టు ఎంచుకోవచ్చు.
  • చతురస్రాకారంగా ఫేస్ ఉన్నవారు డిజైన్స్ కంటే హైలైట్‌గా ఉండే గుండ్రని, చంద్రుని ఆకారంలో ఉంటే బిందీలను పెట్టుకుంటే ఫేస్ చక్కగా, అందంగా కనిపిస్తుంది.

అయితే.. ఒక్కోసారి కొన్ని రకాల స్టిక్కర్స్ వెంటనే ఊడిపోతాయి.. అలా కాకుండా ఉండాలంటే.. పౌడర్ రాసుకోవాలి. పౌడర్ రాయడం వల్ల స్టిక్కర్స్ అనేవి తొందరగా ఊడిపోకుండా ఉంటుంది. చాలామంది కుంకుమ, తిలకం, లేదా విభూది పెట్టుకుంటారు. ఇది హిందువులకు సంబంధించినంత వరకు అతి ముఖ్యమైన సాంప్రదాయం.

ఇది కూడా చదవండి: ఎంత మొండి దగ్గు అయినా ఈ చిన్న చిట్కాతో పరార్..తక్షణమే ఉపశమనం

#women #beauty-tips #forehead-blob
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe