PM Kisan: రైతులు ఇదొక్కటి చేస్తే చాలు..ఖాతాల్లోకి ఏడాదికి 36వేలు జమ..పూర్తి వివరాలివే..!!

పీఎంకిసాన్ మన్ ధన్ పథకం ద్వారా రైతులకు వృద్ధాప్యంలో పెన్షన్ ఇచ్చి ఆదుకునే స్కీం. రైతులు వృద్ధాప్యంలో ప్రతీ నెలా రూ. 3వేల చొప్పున పెన్షన్ పొందవచ్చు. 18ఏళ్ల నుంచి 40ఏళ్ల లోపు వయస్సున్న రైతులు, 2హెక్టార్ల లోపు పొలం ఉన్న రైతులు ఈ స్కీంలో చేరేందుకు అర్హులు.

PM Modi: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. నెలకు రూ.3 వేల పెన్షన్!
New Update

రైతులకు అదిరిపోయే న్యూస్. రైతు కుటుంబానికి ఏడాదికి 36వేలు ఇస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్. అది కూడా నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేస్తోంది. మరి ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం దేవంలోని రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకువస్తూ...వాటిని చక్కగా అమలు చేస్తోంది. ఈ పథకాల ద్వారా అర్హులైన రైతులందరికీ డబ్బు, పంటసాయం అందిస్తోంది. దీనిలో భాగంగానే వయస్సు మీదపడిన రైతులకు కూడా ఒక అద్బుతమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే పీఎం కిసాన్ యోజన కింద ప్రతిఏటా 6వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డుల ఇవ్వడం నుంచి వీటి ద్వారా లోన్స్ కూడా మంజూరు చేయడం లాంటివి చేస్తూ రైతులకు ఆసరాగా నిలుస్తోంది మోదీ సర్కార్. ఇప్పుడు రైతుల భవిష్యత్తు కూడా ఫోకస్ పెట్టింది.

ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ వయస్సు దాటిన రైతులకు ఆర్థికంగా మద్దతు ఇచ్చేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే పీఎం కిసాన్ మన్ ధన్ పథఖం తీసుకువచ్చింది. రైతులకు వృద్ధాప్యంలో పెన్షన్ ఇచ్చి ఆదుకోవడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ స్కీమ్ ద్వారా రైతులు తమ తమ వృద్ధాప్యంలో ప్రతీ నెలా రూ. 3వేల చొప్పిన పెన్షన్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఝార్ఖండ్ లోని రాంచీలో ప్రధాని మోదీ 2019 సెప్టెంబర్ లో ఈ స్కీంను ప్రారంభించారు. అయితే ఈ పథకంలో ఎవరు అర్హులో తెలుసుకుందాం.

18 ఏళ్ల నుంచి 40ఏళ్ల లోపు వయస్సున్న రైతులు..అదేవిధంగా రెండు హెక్టార్లలోపు పొలం ఉన్న రైతులు ఈ పథకంలో చేరేందుకు అర్హలు. ఈ పథకంలో చేరే రైతులు ప్రతీనెలా కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇదే చేరే వ్యక్తి వయస్సును బట్టి మారుతుంది. ఈ స్కీంలో చేరిన తర్వాత వయస్సును బట్టి ప్రతీనెలా రూ. 55 నుంచి రూ. 200 మధ్య పెన్షన్ అకౌంట్లో జమ చేయాలి. తక్కువ వయస్సున్నప్పుడే ఈ స్కీంలో చేరితే చెల్లించాల్సిన ప్రీమియం తక్కువగా ఉంటుంది. 18ఏళ్ల వయస్సులో చేరితే రూ. 55 ప్రీమియం, 30ఏళ్లలో చేరితే రూ. 110 ప్రీమియం, 40ఏళ్ల వయస్సులో చేరితే రూ. 200 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 40ఏళ్లు దాటినవారు ఈ పథకంలో అర్హులు కారు. రైతులు 60ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు ఈ ప్రీమియం చెల్లించాలి.

రైతులకు 60ఏళ్లు పూర్తివ్వగానే కేంద్రం నుంచి ప్రతీనెలా రూ. 3వేల చొప్పున పెన్షన్ వస్తుంది. పెన్షన్ తీసుకుంటున్న రైతు మరణిస్తే జీవిత భాగస్వామికి 50శాతం కుటుంబానికిపెన్షన్ కూడా వస్తుంది. జీవిత భాగస్వామికి పెన్షన్ వద్దుకుంటే ఇప్పటివరకు మీరు ఎంత చెల్లిస్తారో...ఆ మొత్తం కూడా వడ్డీతో తిరిగి చెల్లిస్తారు. ఒకవేళ మీ జీవిత భాగస్వామి 50శాతం ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటే...జీవిత భాగస్వామి మరణించినప్పుడు నామినీకి డబ్బులు ఇస్తారు. ఇక ఈ స్కీంలో కొన్నేళ్లు ప్రీమియం చెల్లించిన తర్వాత, రైతులు స్కీమ్స్ నుంచి బయటకు వచ్చేస్తే చెల్లిస్తేనే మొత్తం వడ్డీతో సహా తిరిగి ఇస్తుంది ప్రభుత్వం.

మొత్తానికి ఈ లెక్కన రైతులు వృద్ధాప్యంలో ఏడాదికి 36వేల రూపాయలు తీసుకునేలా ఈ పథకం రూపొందించారని అర్థం చేసుకోవచ్చు. ఇది రైతులకు ఎంతో ఆసరా ఇచ్చే పథకమని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: రైల్వే ప్రయాణికులకు షాక్.. తెలంగాణ, ఏపీలో భారీగా రైళ్లు రద్దు.. వివరాలివే!

#pm-kisan #pm-kisan-maandhan-yojana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe