Fatty Liver: ఈ నాలుగు శరీర భాల్లో వాపు వస్తే ఫ్యాటీ లివర్‌ ఉన్నట్టే

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండేవారిలో ఫ్యాటీ లివర్ ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలోని పొత్తికడుపు, చీలమండ, చేతుల్లో, ఛాతీ భాగాల్లోవాపు వంటి లక్షణం ఉంటే ఫ్యాటీ లివర్ వ్యాధి చాలా తీవ్రమైన స్థితిలో ఉనట్లని నిపుణులు అంటున్నారు.

Fatty Liver: ఈ నాలుగు శరీర భాల్లో వాపు వస్తే ఫ్యాటీ లివర్‌ ఉన్నట్టే
New Update

Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్య ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, వ్యర్థ పదార్థాలు సరిగ్గా బయటికిపోలేక కాలేయ కణజాలంలో పేరుకుపోవడం. చాలా మంది వ్యాధి లక్షణాలు తెలియక ఆస్పత్రిపాలు అవుతున్నారు. కానీ ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో శరీరంలో కొన్ని చోట్ల వాపు వస్తుంది. యాటీ లివర్ డిసీజ్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవారిలో, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండేవారిలో ఫ్యాటీ లివర్ ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా కొన్ని కారణాలు కూడా ఉంటాయి. కాలేయం వ్యర్థాలను శుభ్రపరచడం, తొలగించడం మాత్రమే కాకుండా శరీరానికి అవసరమైన కొన్ని విటమిన్లు, ఖనిజాలు, కొవ్వులను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి కాలేయంలో సహజంగా కొంత కొవ్వు ఉంటుంది. కానీ కొవ్వు పరిమాణం మన కాలేయం బరువులో 5 శాతం కంటే తక్కువగా ఉండాలి. కాలేయం దాని బరువులో 5 నుండి 10 శాతానికి పైగా పెరిగినప్పుడు, అది ఫ్యాటీ లివర్‌గా మారుతుంది. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడ కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఫ్యాటీ లివర్‌ మొదటి దశ:

  • మొదటి దశలో కాలేయం కొద్దిగా ఉబ్బి ఉంటుంది. కాలేయంలోని కణజాలాలకు నష్టం జరుగుతుంది. అలాంటి సమయంలో మన శరీరంలోని కొన్ని భాగాలు పెద్దగా వాచిపోతాయి.

పొత్తికడుపు వాపు:

  • ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో పొత్తికడుపు వ్యాకోచం ఏర్పడుతుంది. కాలేయంలో కొవ్వులు పేరుకుపోయినప్పుడు పొత్తికడుపు వాపు వస్తుంది. నిలబడి ఉన్నప్పుడు ఉదర వాపు గమనించవచ్చు. ముఖ్యంగా కడుపు కుడి వైపు వాపు నొప్పి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

చీలమండ వాపు:

  • ఫ్యాటీ లివర్ వ్యాధికి చీలమండ వాపు మరొక ముఖ్యమైన లక్షణం. కాలేయంలో కొవ్వులు అధికంగా చేరడం వల్ల శరీరంలోని అనవసర వ్యర్థ ద్రవాలు చీలమండలు, పాదాలలో పేరుకుపోతాయి. అధిక ద్రవం చేరడం వల్ల వాపు, నొప్పికి కారణమవుతుంది. కాళ్లు, పాదాలు, చీలమండలలో వాపు అంటే ఫ్యాటీ లివర్ వ్యాధి ముదిరిన దశలో ఉందని నిపుణులు చెబుతున్నారు.

చేతుల్లో వాపు:

  • చేతుల వాపు సాధారణంగా కాలేయ వ్యాధి చివరి దశలో సంభవిస్తుంది. కాలేయంలోని విషపూరిత ద్రవం చేతుల్లో పేరుకుపోయి వాపునకు కారణమవుతుంది. ఫ్యాటీ లివర్‌, హైపర్‌టెన్షన్ ఉన్నవారిలో చేతి వాపు కాలేయ వైఫల్యానికి కారణమని నిపుణులు అంటున్నారు.

ఛాతీ వాపు:

  • ఫ్యాటీ లివర్ వ్యాధి మరింత తీవ్రంగా మారినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ లక్షణం పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఛాతీ కణజాలంలో ద్రవం చేరడం వాపునకు కారణమవుతుంది. ఈ లక్షణం ఉంటే ఫ్యాటీ లివర్ వ్యాధి చాలా తీవ్రమైన స్థితిలో ఉందని అర్థం చేసుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: చేపలు, మజ్జిగ కలిపి తింటే బొల్లి మచ్చలు వస్తాయా?

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #fatty-liver #body-parts #swelling
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe